ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 లో జరిగిన మొట్ట మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పార్టీ భారీ మెజార్టీతో అధికారాన్ని దక్కించుకుంది. అలాగే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మంచి పనులను కూడా చేసింది. దానితో ఈ ప్రభుత్వం కనీసం 10 ఏళ్లయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా 2014వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.

ఇక జగన్ అధ్యక్షతన వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. జగన్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఎన్నో మంచి పనులు చేసింది. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాకు వయసు అయిపోయింది. ఈసారి నన్ను గెలిపించండి మీకు మంచి పనులు చేస్తాను అని హామీలు ఇస్తూ చాలా కాలం నుండి వస్తున్నాడు. మరికొంత కాలంలోనే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దానితో బాబు ఒంటరిగా వెళ్తే పనికాదు అని అనుకున్నాడో ఏమో..? ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో క్రేజ్ కలిగిన జనసేన, బీజేపీ పార్టీలను కూడా తనతో వెంట పెట్టుకున్నాడు.

మొదట తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిసి ఒకే కూటమిలా పోటీ చేస్తూ ఉండడం వైసీపీ ఒంటరిగా ఉండడంతో చాలా మంది ఇది జగన్ కి పెద్ద మైనస్ అవుతుంది అని అనుకున్నారు. కాకపోతే ఆ తర్వాత సీట్ల పంపకం విషయంలో కూటమి చాలా తర్జన బర్జన పడింది. అలాగే కొన్ని సీట్ల విషయంలో ఇప్పటికే అనేక గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బాబుకు మైనస్ అయ్యే అవకాశాలుగాను జగన్ కి ప్లేస్ అయ్యే అవకాశాలుగాను కనిపిస్తున్నాయి. మరి ఇప్పటివరకు సీట్ల పంపిణీ విషయంలో స్పీడ్ గా నిర్ణయం తీసుకున్న జగన్ కే ఎక్కువ పాజిటివిటి కనిపిస్తోంది. మరి సీట్ల పంపిన విషయంలో బాబు ఫెయిల్ కావడం జగన్ కి కలిసి రానుందా.

మరింత సమాచారం తెలుసుకోండి: