12 యేళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు 40 యేళ్ళ అనుభవం ఏమైంది..

•జగన్ వ్యూహాత్మక ఆలోచనే బాబును భయపెడుతోందా

•బాబుని భయపడుతుంది ఆ ఒక్కడేనా..


(అమరావతి - ఇండియా హెరాల్డ్)
మరి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలు అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష పార్టీకి చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా అధికార పార్టీ సంగతి అటుంచితే ప్రతిపక్ష పార్టీకి ఈ సారీ గెలవడం అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా 40 సంవత్సరాలు అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు.. ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకుడికి భయపడింది లేదు..అలా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం.. ఇప్పుడు 12 సంవత్సరాల ఒక యంగ్ లీడర్ అనుభవం ముందు తేటతెల్లమయింది.. అసలు ఎందుకు చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలను రచించడం లేదు.. ఒకప్పుడు టిడిపి పార్టీ తరపున రాష్ట్రాన్నే తన ఆధీనంలో పెట్టుకున్న ఆయన.. ఇప్పుడు ఆ శక్తి, తెలివితేటలు ఏమయ్యాయి? అసలు చంద్రబాబు దేనికి భయపడుతున్నారు..? ఒక యంగ్ లీడర్ ముందు తన అనుభవాన్ని బూడిదలో పోస్తున్నారా?  అనే అనుమానాలు ఇప్పుడు ఓటర్స్ లో కూడా కలుగుతున్నాయి..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ముందడుగు వేస్తుంటే.  చంద్రబాబు మాత్రం పొత్తులో భాగంగా ఈసారి ఎలాగైనా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 2019 ఎన్నికలలో జనసేన పార్టీ కారణంగా ఓట్లు చీలడంతో ఇప్పుడు ఆ పార్టీని అలాగే బిజెపి పార్టీను కలుపుకొని పొత్తుతో ముందుకు వెళుతున్నారు. పైగా చంద్రబాబు నాయుడు వయసు పై పడుతుండడంతో.. ఇక మళ్ళీ ఎన్నికలలో ఆయన కొనసాగడం కష్టంగా మారుతోంది.. కనీసం ఆయన తదనంతరం ఆయన వారసుడు లోకేష్ గద్దెనెక్కుతారు అంటే.. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచే అవకాశాలు కూడా పెద్దగా కనిపించడం లేదనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్ తన సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటువైపు జగన్ ఒంటరిగా పోరాటం చేస్తున్నారు.. మరోవైపు కూటమిలో భాగంగానే చంద్రబాబు తన పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందా లేదా అనే ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. జగన్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ ఖచ్చితంగా తన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలే తనను మళ్ళీ గెలిపిస్తాయని ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు..ముఖ్యంగా జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను,  వారి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ఆలోచనలను రచిస్తూ ముందుకు వెళుతున్నారు.. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులు , మహిళలు,  పిల్లలు వారి భవిష్యత్తే ప్రధానంగా ముందడుగు వేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే జగన్ కి ప్రజలు పట్టం కడుతున్నారు. యంగ్ లీడర్ జగన్ వ్యూహాత్మక ఆలోచనలకు 40 యేళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు భయపడుతుండడం..  ఇప్పుడు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చంద్రబాబునే  భయపడుతున్న జగన్ అంటూ యాంటీ ఓటర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: