గత ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయానికి చంద్రబాబు నాయుడు పాలన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికలు జరగడానికి ముందే వైసీపీ విజయం సాధిస్తుందని తేలిపోయింది. అయితే చంద్రబాబు బహిరంగ సభలలో మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య అందించిన పాలన తరహా పాలననే అందిస్తానని చెబుతున్నారు. మళ్లీ అదే పాలన అంటున్న బాబు కామెంట్లు చేయడంతో షాకవ్వడం తెలుగుదేశం పార్టీ నేతల వంతవుతోంది.
 
చంద్రబాబు నాయుడు స్పీచ్ మారకపోతే మొదటికే మోసం వస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈతరం ప్రజల ఆలోచనా శైలికి అనుగుణంగా చంద్రబాబు మారాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ పై రాయి ఘటన గురించి పదేపదే చంద్రబాబు ప్రస్తావిస్తూ కొత్త అనుమానాలకు ఛాన్స్ ఇస్తున్నారని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
ఈ కేసుకు సంబంధించి బోండా ఉమాను ఇరికించే కుట్ర జరుగుతుందని చంద్రబాబు చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. బోండా ఉమపై అనుమానాలు ఉన్నాయని పోలీసులు కానీ వైసీపీ నేతలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. చంద్రబాబు చేసిన కామెంట్ల వల్ల బోండా ఉమ తప్పు చేశారని కొంతమంది భావించినా ఆశ్చర్యాపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
 
పోలీస్ శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. ఈసీ పర్యవేక్షణలో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని బాబు కోరుతున్నారు. అయితే పోలీసులు అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నిందితుడు దొరికాడని కానీ దొరకలేదని కానీ ఎక్కడా చెప్పలేదు. పోలీసుల నుంచి రియాక్షన్ లేకుండానే చంద్రబాబు స్పందిస్తూ పార్టీ పరువు తీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు రాయి ఘటనను మరిచిపోయి ఎన్నికల ప్రచారంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు ప్రచారం విషయంలో వేగం పెంచాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: