మహారాష్ట్ర నుంచి మొదలు కొని పశ్చిమ బెంగాల్ వరకు…తమిళ నాడు నుంచి దిల్లీ  దాకా.. జార్ఖండ్ నుంచి రాజస్థాన్ దాకా.. మోదీ ప్రధానిగా ఉన్న గత పదేళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కేసులు ఎదుర్కొన్న నాయకులు ఉన్నారు. తెలంగాణలో కవిత, దిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు జైలు పాలయ్యారు.


జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కటకటాల పాలయ్యారు. ఇంకా పలువురు నాయకులు కూడా సీబీఐ, ఈడీ, ఐటీ దాడులకు గురయ్యారు. అయితే ఈడీ కేసులకు సంబంధించి ప్రధాని మోదీ సరికొత్త లెక్క చెప్పారు. బీజేపీయేతర రాజకీయ నేతలనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పు పట్టారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈడీ చర్యలు కొనసాగుతున్నాయయని వివరించారు.


ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో 3 శాతం వాటికే రాజకీయ సంబంధాలు ఉన్నాయని.. మిగతా 97 శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవే అని వెల్లడించారు. అయితే సత్యేందర్ జైన్, మనీశ్ సిసోదియా వంటి ఆప్ కీలక నేతలు సహా పదుల సంఖ్యలో నాయకులు జైలు పాలైన నేపథ్యంలో ఈడీకేసుల్లో 30 శాతం మందివే రాజకీయ పరమైనవా అనే ప్రశ్న వస్తోంది.


అయితే ఈ మూడు శాతంలో బీజేపీ నేతల వాటా ఎంతో మోదీ చెప్పకపోవడం గమనార్హం. రాజకీయ నేతలపై మూడు శాతం నిజమే అయినా.. ఇందులో బీజేపీయేతర.. బీజేపీ నాయకుల పేర్లు కూడా చెబితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంతకీ ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కొన్న నేతలు ఎవరా అని పలువరు ఆశ్చర్యపోతున్నారు.  బీజేపీలో చేరిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుల  కేసుల్లో పురోగతి లేకపోగా.. చేరని వారి కేసులు వేగంగా ముందుకు కదులుతాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: