మహావేడి మీద ఉన్న ఏపీ రాజకీయాలను మూడు రోజుల క్రితం సీఎం జగన్ పై రాయి దాడి ఘటన అమాంతం మార్చేసింది. అప్పటి నుంచి పరస్పరం విమర్శలు, స్పందనలతో హోరెత్తుతోంది. దాడి అనంతరం ఒక రోజు విరామం తీసుకున్న జగన్.. మరుసటి రోజు నుంచి తనపై దాడి ద్వారా పేదలను లక్ష్యంగా చేసుకున్నారని.. టీడీపీ కూటమిని నిందించారు.


ఇక జగన్ పై దాడిని టీడీపీ అధినేత ఖండించగా.. ఆ పార్టీ వారు స్పందిస్తూనే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే దీనిని డ్రామాగా, కోడి కత్తి 2.0 గా అభివర్ణించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం జగన్ పై దాడిని ఖండించగ పోగా.. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు. ఇక ప్రధాని మోదీ అయితే జగన్ జరిగిన దాడికి సానుభూతి వ్యక్తం చేస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


కూటమి లో ఉన్న మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ లు ఈ డ్రామాలపై మూడు రకాల మాటలు మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది. వీరి మధ్య ఏకాభిప్రాయం కరవైనట్లు కనిపిస్తోంది. దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు.  ఆతర్వాత దీనిని డ్రామాగా కొట్టిపారేసి యూ టర్న్ తీసుకున్నారు.


నారా లోకేశ్ అయితే దాడి జరిగిన వెంటనే ఆ  రాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇది డ్రామా అని టీడీపీ నేతలు అంటుంటే చంద్రబాబు దాడిని ఎందుకు ఖండించారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణేమో బాధ్యులపై అధికారులతో విచారణ ఎలా జరుపుతారు అని ప్రశ్నించారు. ఈ ఘటన నిజమని నమ్మితేనే కదా విచారణ తరహా వ్యాఖ్యలు చేసేది అని విశ్లేషిస్తున్నారు. దాడి నిజమా అబద్ధమా అనే అంశంపై కూటమిలో స్పష్టత లేక అవసరాల కోసం మాట్లాడితే .. జనంలో నవ్వులు పాలు కావాల్సి వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: