•కోస్తాలో పట్టు సాధించుకున్న వైసీపీ
•కోస్తాలో టీడీపీకి కూటమికి చెక్ పెట్టనున్న జగన్
•కోస్తా ప్రజలకు కీలకంగా మారిన జగన్


2014 నాటికి జగన్ మోహన్ రెడ్డి కేవలం రాయలసీమ నాయకుడు మాత్రమే. ఆ తరువాత ఆయన కోస్తాలో తన పార్టీ రాజకీయ పలుకుబడిని బాగా విస్తరించుకున్నారు. ఆయన పాదయాత్ర ఫలితంగా అందరికీ దగ్గర అయ్యారు.ఇక అయిదేళ్ల పాటు ఏపీ సీఎం గా జగన్ మోహన్ రెడ్డి కోస్తా ప్రాంతాల ప్రజలకు కూడా కీలక నేతగా మారారు. అదే ప్రస్తుతం వైసీపీకి అడ్వాంటేజ్ గా మారబోతోంది. అందుకే ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ఫలితాలు కోస్తాలో వైసీపీకి కొంత సానుకూలంగా వస్తున్నాయి. రాయలసీమలో జగన్ మోహన్ రెడ్డి తన పట్టుని అలా కాపాడుకుంటూనే కోస్తాలో టీడీపీ కూటమికి చిల్లు పెడుతున్నారు.2014 లో రాయలసీమ వైసీపీకి పట్టం కడితే కోస్తా టీడీపీకి అధికారం ఇచ్చింది. కోస్తాలోని ఏడు ఉమ్మడి జిల్లాలోని 101 సీట్లలో 90 శాతం సీట్లు టీడీపీకి దక్కాయి. దాంతో జగన్ ఓన్లీ 67 సీట్ల దగ్గర ఆగిపోయారు. అయితే ఈ పదేళ్లలో జగన్ మోహన్ రెడ్డి పలుకుబడి కోస్తా జిల్లాలలో బాగా పెరిగింది.


టీడీపీకి  కంచుకోటలుగా భావించే ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీ తన ప్రభావాన్ని పెంచుకుంది. ఇంకా గుంటూరు, క్రిష్ణా జిల్లాలలో కూడా జగన్ టీడీపీకి ధీటుగా పట్టు సాధించారు. అలాగే గోదావరి జిల్లాలలో కూడా న్యూట్రల్ చేయగలిగారు. దీంతోనే వైసీపీలో గెలుపు ధీమా పెరిగింది.రాయలసీమలో ప్రస్తుతం మొత్తం 52 సీట్లకు గానూ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి 35 సీట్లకు తగ్గకుండా వస్తాయి. అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న 22 సీట్లలో సగం సీట్లు వస్తాయని లెక్క. అంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో 46 సీట్లు వైసీపీకి కచ్చితంగా వచ్చేలా ఉన్నాయని తెలుస్తుంది.రాయలసీమలో ఎలాగో మంచి పట్టుంది కాబట్టి 42 సీట్లు కోస్తాలో వైసీపీ గెలుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 101 సీట్లలో 42 సీట్లు అంటే వైసీపీకి ఈజీ టాస్క్. కానీ  రాజకీయం చూస్తే హోరా హోరీ పోరు ప్రతీ చోటా ఉంది.కాబట్టి మెజారిటీ సీట్లు ఏ ఒక్క పార్టీ సాధించడం కష్టమే అని సర్వే అంచనాలు చూస్తే అర్ధం అవుతుంది.అందుకే తమ వాటాగా కనీసం యాభై దాకా సీట్లు తెచ్చుకున్నా చాలు సింపుల్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని వైసీపీ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: