- బీజేపీ సీట్ల‌లో మెజార్టీ క‌మ్మ వర్గానికి ద‌క్కేలా గేమ్‌
- బీజేపీలో కాపు, బీసీ, ఎస్సీల‌ను అణ‌గ‌దొక్కుతోన్న వైనం
- చింత‌మ‌నేని సీటులోనూ బీజేపీ క‌మ్మ నేత‌కే సీటు..!


( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు త‌న ప్ర‌యోజ‌నాల కోసం ఏపీ బీజేపీ పీక మీద కాలుపెట్టి గొంతు నొక్కి మ‌రీ చంపేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు సొంత పార్టీ నేత‌ల నుంచే తీవ్రంగా వినిపిస్తున్నాయి. అస‌లు ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టాక అంత‌ముందు వ‌ర‌కు యాక్టివ్‌గా ఉన్న నేత‌లు అంద‌రూ బీజేపీకి దూర‌మ‌య్యారు. పురందేశ్వ‌రి త‌న సొంత ఎజెండాతో ముందుకు వెళుతూ ఇటు త‌న మ‌రిది చంద్ర‌బాబు స్వ‌ప్ర‌యోజ‌నాల‌తో పాటు త‌న ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే పాటు ప‌డుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో ఆమె రాజంపేట నుంచి పొత్తులో పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా పొత్తు ఉండ‌డంతో ఆమె అక్క‌డే పోటీ చేయ‌వ‌చ్చు.. కానీ త‌న‌కు సేఫ్ సీటు అయిన రాజ‌మండ్రి నుంచి పోటీ చేస్తున్నారు.


ఇక్క‌డ కూడా ఈ పార్ల‌మెంటు ప‌రిధిలో అన‌ప‌ర్తి సీటు బీజేపీకే ఇచ్చారు. మామూలుగా అయితే పురందేశ్వ‌రి చాలా హ్యాపీ ఫీల్ కావాలి.. త‌న పార్ల‌మెంటు ప‌రిధిలో ఓ అసెంబ్లీ సీటు కూడా బీజేపీకి ఇచ్చారంటే దానిని ఆమె గెలిపించుకోవాలి.. కానీ అక్క‌డ బీజేపీ పోటీ చేస్తే ఖ‌చ్చితంగా తాను ఓడిపోతాన‌న్న భ‌యంతోనే ఇప్పుడు ఆ సీటు టీడీపీకి ఇచ్చేలా ఏలూరు జిల్లాలో దెందులూరు సీటు బీజేపీకి ఇచ్చేలా చ‌క్రం తిప్పేశారు. అస‌లు ఏపీ బీజేపీ క్యాండెట్ల‌ను చూస్తే పురందేశ్వ‌రి కాపు, బీసీ వ‌ర్గాల‌ను అణ‌గ‌దొక్కేసి పూర్తిగా త‌న సామాజిక వ‌ర్గానికే పెద్ద పీఠ వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంలో ఆమె త‌న మ‌రిది చంద్ర‌బాబునే మించిపోయారంటున్నారు.


అసెంబ్లీ 10 సీట్ల‌లో ఎచ్చెర్ల క్యాండెట్‌తో పాటు కైక‌లూరు కామినేని శ్రీనివాస్‌, విజ‌య‌వాడ వెస్ట్ సుజ‌నా చౌద‌రితో పాటు తాజాగా దెందులూరు సీటు ఇచ్చే త‌ప‌న చౌద‌రి సైతం క‌మ్మ వారే. ఇక ధ‌ర్మవ‌రంలో పోటీ చేస్తోన్న స‌త్య‌కుమార్ భార్య కూడా క‌మ్మ వ్య‌క్తే. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాపుల‌కు ఇచ్చిన ప‌పాన పోలేదు. ఇక ఎంపీ సీట్ల‌లో పురందేశ్వ‌రి క‌మ్మ‌... అన‌కాప‌ల్లి క్యాండెట్ సీఎం ర‌మేష్ భార్య క‌మ్మ‌, అర‌కు ఎంపీ క్యాండెట్ కొత్త‌ప‌ల్లి గీత భ‌ర్త క‌మ్మ కావ‌డం విశేషం.ఏది ఏమైనా పురందేశ్వ‌రి త‌న సొంత సామాజిక వ‌ర్గ‌, త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం ఏపీ బీజేపీని బ‌లి పెడుతున్నార‌న్న మాట‌లు ఆ పార్టీ వాళ్లే చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: