వైసీపీకి దూర‌మ‌య్యారు. కాంగ్రెస్ నుంచి క‌ద‌న‌రంగంలోకి దూకబోతున్నారు. ఏపీలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు వ‌స్తాయా ? అన్న డౌట్లు కాదు.. ఏకంగా ఆ నేత గెలుపు మీదే రాజ‌కీయ వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. కేవ‌లం గెలుపు మాత్ర‌మే కాదు.. ఏకంగా మెజారిటీపైనా ఆయ‌న ధీమాగా ఉన్నారు. ఆయ‌నే మాజీ ఎమ్మెల్యే, చీరాల సింహంగా పిలుచుకునే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. త్వ‌ర‌లోనే ఆయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. చీరాల నుంచే పోటీ చేయ‌నున్నారు. అయితే.. ఆయ‌న గెలుపుపైనే కాదు.. మెజా రిటీపైనే ఎక్కువ‌గా ఇక్క‌డ చ‌ర్చ సాగుతోంది.

ఏకంగా 2014 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా వ‌చ్చిన 10 వేల మెజారిటీని మించి ఆమంచి విజ‌యం ద‌క్కించుకుంటార‌ని అంటున్నారు ప‌రిశీలకులు. దీనికి కార‌ణం.. మాస్‌లో ఆయ‌న‌కు ఉన్న చెక్కు చెద‌ర‌ని ఫాలోయింగ్‌. అంతేకాదు.. ప్ర‌జానాయ‌కుడిగా కూడా పేరు తెచ్చుకోవ‌డంతో ఆమంచి వైపే జ‌నాలు నిల‌బ‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మి త‌ర్వాత కూడా చీరాలకు ఆమంచి దూరం కాలేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించారు. ఒకానొక ద‌శ‌లో చెల‌రేగిన మ‌త్స్యకార వివాదాన్ని త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రించారు.

అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీకి తాను అధికారంలో లేక‌పోయినా.. వైసీపీలో ఉన్న కార‌ణంగా.. ఆయ‌న చేసి పెట్టారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఆమంచి గ్రాఫ్ మ‌రింత పెరిగింది. ఇక‌, ఇంత చేసినా.. వైసీపీ ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోవడాన్ని ఇక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ఆమంచికి అన్యాయం జ‌రిగింద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. దీనికి.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్య‌తిరేక త తోడైంది. ప‌లితంగా ఇప్పుడు ఆమంచి పేరు నియోజ‌క‌వ‌ర్గంలో మార్మోగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఆమంచి నామినేష‌న్ వేయ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా చీరాల ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు రెండు ప్ర‌ధాన పార్టీల నుంచి పోటీ చేస్తోన్న  ఇద్ద‌రు నేత‌లు నియోజ‌కవర్గానికి నాన్‌లోక‌ల్‌... ఆమంచి లోక‌ల్ కావ‌డంతో ఈ సారి ఈ నినాదం బాగా ప్ల‌స్ అవుతోంది. ఇక‌, కాంగ్రె స్ పార్టీ కూడా.. చీరాల‌పై ఆశ‌లు పెట్టుకుంది. ఇక్క‌డ తిరిగిపార్టీ పున‌ర్వైభ‌వం ద‌క్కించుకునేందుకు ప్ర‌యత్నాలు ముమ్మ‌రం చేస్తోంది. అంతేకాదు.. ఆమంచి గెలుపు ఖాయ‌మ‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీపుంజుకోవ‌డంపైనా నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌రి  ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. ఈ ద‌ఫా ఆమంచికి సానుభూతి ప‌వ‌నాలు మాత్రం జోరుగానే వీస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: