ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి  ఎదురు ఉండేది కాదు. వారి వ్యూహాలకు  ఎదుటి పార్టీల వారు చతికిల పడేవారు. అలాంటి టిడిపి ప్రభుత్వం చాలా వెనుకబడి పోతుందని చెప్పవచ్చు. చంద్రబాబు వ్యూహాలకు  పదును పెట్టకుండా  నాయకులను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దీనివల్ల  రాష్ట్రమంతా టిడిపి తన గళాన్ని వినిపించలేకపోతుందని చెప్పవచ్చు. అయితే  ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు చేస్తున్నారు. వారు ముఖ్యంగా ఆ  నేతలపై మాత్రమే ప్రధాన దృష్టి పెట్టారట. వారిని ఓడించడం కోసం ఎలాంటి పనులకైనా దిగజారుతున్నారని తెలుస్తోంది. వీరిలో నలుగురు కమ్మ సామాజిక వర్గం  నేతలే. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  గన్నవరం నుంచి పోటీ చేస్తున్న వల్లభనేని వంశీ మోహన్, విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్న దేవినేని అవినాష్, విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని నాని, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని  లను చిత్తుగా ఓడించాలని టిడిపి లక్ష్యం పెట్టుకుంది.

 అయితే వీరిని టిడిపి టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం 2019 ఎలక్షన్ టైం లో దేవినేని అవినాష్ గుడివాడ నుంచి టిడిపి తరఫున పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వైసిపి అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన మంగళగిరి టిడిపి కార్యాలయం పై దాడి చేశారు. అంతేకాకుండా విజయవాడ తూర్పు నుంచి టిడిపి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. ఇక వల్లభనేని వంశీ  గత ఎన్నికల్లో టిడిపి నుంచి గన్నవరంలో పోటీ చేసి గెలిచారు. కొద్ది రోజులకే వైసీపీలో చేరారు.  ఆయన లోకేష్, చంద్రబాబును టార్గెట్ చేసి చంద్రబాబు సతీమణిని కించపరిచె వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో వంశీ తల నరికితే 50 లక్షలు ఇస్తానంటూ ఖమ్మంకు చెందిన టిడిపి నేత ఒకరు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే గన్నవరంలో టిడిపి కార్యాలయం ధ్వంసం  చేశారు. దీంతో టీడీపీ ఆయనను టార్గెట్ చేసింది.  ఇక కేశినేని నాని  టిడిపి నుంచి 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు.

ఆ తర్వాత చంద్రబాబును లోకేష్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం వల్ల ఆయనకి ఈసారి టికెట్ నిరాకరించడంతో వైసిపిలో చేరిపోయాడు. ఈ సీట్ తన తమ్ముడు కేసినేని చిన్నికి కేటాయించారు. ఇక అందరికంటే ముఖ్యుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.  2004, 2009లో టిడిపి తరఫున విజయం సాధించిన నాని ఆ తర్వాత వైసీపీలో 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ను లక్ష్యంగా చేసుకున్న ఆయన వ్యక్తిగత దూషణలు చేస్తూ పాపులారిటీ పెంచుకున్నారు.  ఎన్నికల్లో ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని టిడిపి గట్టిగా నిర్ణయం తీసుకొని ఆయనపై వెనిగండ్ల   రాము అనే అభ్యర్థిని పోటీలో ఉంచింది. ఇక మరో వ్యక్తి మంత్రి జోగి రమేష్. ఈయన పెనమలూరు  నుంచి పోటీ చేస్తున్నారు.  అప్పట్లో ఉండవల్లి లోని చంద్రబాబు ఇంటి పై భారీ ఎత్తున కార్ల కాన్వాయ్ తో వచ్చి దాడులకు దిగారని, దూషణలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరుణంలో ఆ నియోజకవర్గంలో కమ్మవారు ఎక్కువగా ఉండడంతో  జోగి రమేష్ ను ఓడించాలని టిడిపి కంకణం కట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: