కొన్ని తప్పులు ఎవరూ చేయకూడదు. అయినప్పటకీ  ఆ పరిమితులన్నీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. తామేం చేసినా ఎవరో ఒకరు చూసుకుంటున్నారన్న ధీమాతో వ్యవహరించే వారిని కఠినంగా శిక్షించాలి. ఈ తీరును రాజకీయాలకు అతీతంగా తప్పు పట్టాల్సిందే. ఎవరు చేశారో తెలియదు కానీ.. ఏపీ రాజధాని అమరావతిగా శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అక్కడ ఏర్పాటు చేసిన అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందర్నీ షాకుకు గురి చేశారు.


అమరావతి మాస్టర్ ప్లాన్ తెలిపేలా ఏర్పాటు చేసిన మ్యూజియంలో నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాంటి మ్యూజియంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం అది కూడా ఎన్నికల ప్రచారం లో భాగంగా బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పెమ్మసారి చంద్రశేఖర్ ఉద్దండరాయుని పాలెంకు వెళ్లారు.


ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడుతూ మ్యూజియం గురించి ప్రస్తావన రావడం.. రాజధాని నిర్మాణం ఎలా ఉండనుందన్న విషయాన్ని తెలిపే త్రీడీ నమూనాను ఏర్పాటు చేశారు. అలాంటి కీలక మ్యూజియంలోని వాటిని ఎవరో ధ్వంసం చేశారు. ఎలా చేశారు అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇప్పుడితే రాజధాని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  రాజధాని రహదారులు, ఎల్ పీఎస్ లే ఔట్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి సరఫరా విధానాలు, అమరావతి ప్రాంత చరిత్ర, ఆధునాతన రాజధాని కట్టడాలు సచివాలయ భవనాల్ని కళ్లకు కట్టినట్లు చూపే నమూనాలు ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.


కొన్నేళ్ల క్రితం నుంచి ఇందులోకి సందర్శకులను అందుబాటులోకి ఉంచకుండా గ్యాలరీని మూసేశారు. భద్రతా సిబ్బందిని కూడా తీసేశారు. దీంతో ఇక్కడి ప్రాంగణమంతా పిచ్చి మొక్కలను ఆలవాలంగా మారింది.  తాళం పగులగొట్టి మ్యూజియంలోని అద్దాలను, వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఇది ప్రస్తుతం రాజకీయంగా పెను దుమారమే రేగుతోంది. ఏపీ ఎన్నికలు అయ్యే సరికి ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: