టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సమయంలో మూడు పార్టీల పొత్తు వల్ల వైసీపీకి కష్టమేనని ఏపీలో వైసీపీ గెలవడం అసాధ్యమని కామెంట్లు వినిపించాయి. అయితే రోజులు గడిచే కొద్దీ కూటమి బలం నీటి బుడగేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు చాలా నియోజకవర్గాల్లో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపడం లేదు. బస్సు యాత్రలో భాగంగా జగన్ నిర్వహిస్తున్న సభలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండగా కూటమి నేతల సభలకు ఆ రేంజ్ లో రెస్పాన్స్ రావడం లేదు.
 
ఏపీలో బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలను అప్పనంగా వైసీపీకి ఇచ్చేస్తున్నారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతున్నా ఊహించని స్థాయిలో జనం జగన్ సభలకు హాజరవుతున్నారు. కోస్తాలో సైతం జగన్ బహిరంగ సభలు సక్సెస్ అవుతుండటం గమనార్హం. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 88 స్థానాలలో విజయం సాధించాలి. జగన్ ఒకవైపు మిగతా ప్రధాన పార్టీల నేతలు అంతా ఒకవైపు ఉండటం కూడా వైసీపీకి కలిసొస్తోంది.
 
ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీనే ఓడించలేమనే భావనతోనే చంద్రబాబు ఎన్నో త్యాగాలు చేసి పొత్తుల దిశగా అడుగులు వేశారనే భావన టీడీపీ నేతల్లో బలంగా ఉంది. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం ఓట్లను కోల్పోయే అవకాశం ఉందని తెలిసినా భవిష్యత్తులో కేసుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే బాబు పొత్తుకు ఓకే చెప్పారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమిది బలం కాదని వాపేనని టీడీపీ నేతలే భావిస్తున్నారు.
 
యూత్ నుంచి వైసీపీకి ఎక్కువగా సపోర్ట్ దక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రలో ప్రస్తుతం అటు కూటమికి అనుకూలంగా కానీ ఇటు వైసీపీకి అనుకూలంగా కానీ వేవ్ లేదు. అయితే 88 స్థానాలలో వైసీపీనే సులువుగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల లెక్కల ద్వారా అర్థమవుతోంది. చోటా మోటా నాయకులను పార్టీలో చేర్చుకుంటున్న వైసీపీ గ్రామాల్లో పార్టీ మరింత పుంజుకునేలా చేయడంలో సక్సెస్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: