•కూటమే ఓటమికి పునాది

•సింగిల్ గా ఎదుర్కోలేక మింగిల్ అయినా నో లాభం

•కూటమిలో సఖ్యత లేకపోవడమే ప్రధాన కారణం

(అమరావతి - ఇండియా హెరాల్డ్)

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ వైపుగా మలుపు తిరుగుతున్నాయో చెప్పడం అసాధ్య పరిస్థితిగా మారిపోయింది.. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా తన పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం అనే ధీమా వ్యక్తం చేస్తుండగా.. మరొకవైపు టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం కూటమి ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతున్నారు.. అయితే సింగిల్ గా తన పార్టీని అధికారంలోకి తెచ్చుకోలేనని భయపడిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు బిజెపి,  జనసేన లతో మింగిల్ అయ్యి కూటమి ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేయాలనుకున్నారు.. కానీ ఇక్కడ కూడా ఆయనకు కూటమి కలిసి రావడం లేదు . ఒక రకంగా చెప్పాలంటే కూటమి వల్ల అసలు కష్టాలు మొదలయ్యాయి.

ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో టిడిపి , జనసేన , బిజెపి ఒకటి అవ్వడంతో వార్ ఒక్క సైడే అనుకున్నారు.. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం గందరగోళంగా అనిపిస్తుంది. పేరుకే కూటమి కానీ అసలు మూడు పార్టీలలో సఖ్యత లేకపోవడం చూసే జనాలకు విసుగు తెప్పిస్తోందని చెప్పవచ్చు.. ముఖ్యంగా జనసేనకి 30 సీట్లు అనుకుంటే.. 24 సీట్లు తీసుకుని.. అందులో మూడు సీట్లు బిజెపికి వదిలేసుకోవడం.. ఈ 21 సీట్లలో కూడా అభ్యర్థులు లేక మొత్తం పది స్థానాలలో టిడిపి వారికి అలాగే వైసిపి నుంచి వచ్చిన వారికి సీట్లు కేటాయించారు. ముఖ్యంగా మెజారిటీ టిడిపి నుంచి వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది. నిజాయితీగా ముందు నుంచి జనసేన కోసం పనిచేసిన వారికి.. అలాగే డబ్బు ఖర్చు పెట్టుకున్న వారికి టికెట్లు ఇవ్వలేదు. టిడిపి వాళ్లకు టికెట్లు ఇవ్వకపోతే జనసేన నుంచి టికెట్లు ఇప్పించుకున్న దుస్థితి ఏర్పడింది. ఇక బిజెపి పొత్తులో భాగంగా 10 సీట్లు కేటాయించగా.. ఆ 10 సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు అతలాకుతలం అవుతున్నారు.


చివరికి పార్టీ కంచుకోటగా ఉన్న దెందులూరు కూడా బిజెపి అడగడంతో అక్కడ టికెట్ బిజెపికి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ తమ టికెట్ తమకే కావాలని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ముఖ్యంగా కూటమిలో సఖ్యత లేకపోవడం కూటమి నాశనానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. పైగా ఒకే కాన్సెప్ట్ వివేకా హత్య కేసును మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకొస్తూ జగన్ ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఇవేవీ జగన్ ఓటు బ్యాంకు పై పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఒకరకంగా చెప్పాలి అంటే సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్ ను ఎదుర్కోవడానికి ఇక్కడ మూడు పార్టీలు ఏకమయ్యాయి.. కానీ ఈ మూడు పార్టీలలో కూడా సఖ్యత లేకపోవడం జగన్ కు ప్లస్ అవుతోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేసినా జనాల్లో మంచి పేరు దక్కించుకునే వారేమో ..కానీ ఆయన అలా చేయకుండా పొత్తులో భాగంగా ఉన్న పరువును కూడా పోగొట్టుకుంటున్నారనే వార్తలు ఇప్పుడు ఓటర్లలో వినిపిస్తున్నాయి.. మరి కూటమి కష్టాలు మొదలయ్యాయి... జగన్ ని ఎలా ఎదుర్కొంటారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: