• టిడిపికి కలిసిరాని ఐకమత్యం..
• కూటమిలో కుంపటి పెట్టిన బీజేపీ,జనసేన
• చంద్రబాబు కూటమే జగన్ కు శ్రీరామరక్ష..

ఐక్యమత్యమే మహాబలం అన్నారు పెద్దలు. కానీ అలాంటి ఐక్యమత్యం ప్రస్తుత  టిడిపి రాజకీయాలను కుదేలు చేస్తోంది. పొత్తుల ఎత్తులు వేసి చంద్రబాబు  అధికారంలోకి రావాలని చూసినా కానీ అది వర్కవుట్ అవ్వడం లేదు. అంతా కలిసి జగన్ ను హీరో చేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి కలగకమానదు. ఎన్నో వ్యూహాలు రచించి వేసిన   కూటమి బాణం  జగన్ కు తగలకుండా కాస్త టర్న్ అయ్యి మళ్ళీ కూటమినే  కూల్చేస్తోంది. మరి అలాంటి కూటమి ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ పొందబోతోంది. జగనే గెలుస్తాడా.? లేదా కూటమి ముందు డీలా పడతాడా.? అనే వివరాలు చూద్దాం.

 కూటమి కష్టాలు:
 ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వన్ సైడ్ వార్ చేసినటువంటి  టిడిపి  ప్రస్తుతం వానపాములా ముందుకు వెళ్తోంది. జగన్ స్పీడ్ కు బ్రేకులు వేయలేక, అక్కరకురాని వ్యూహాలతో వైసీపీని హీరోను చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను పట్టుకోవడంలో కూటమి  విఫలం అవుతుందని చెప్పవచ్చు. అయితే చంద్రబాబు జగన్ ను గద్దె దించడం  కోసం బిజెపి, జనసేనతో జతకట్టారు. ఇందులో 21 అసెంబ్లీ, 2 ఎంపీ  స్థానాలు జనసేన అభ్యర్థులకు కేటాయించింది.  అలాగే బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ సీట్లను కేటాయించింది. మిగతా చోట్ల  టిడిపి అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. ఈ విధమైన లెక్కలతో వచ్చిన   చంద్రన్న  ప్రచారంలో మాత్రం డీలా పడిపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ జగన్ దారిలోకే వెళ్తున్నారని చెప్పవచ్చు. సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు జగన్  ఎవరితో పొత్తు లేకుండా చాలా వ్యూహాత్మకంగా  అన్ని స్థానాల్లో అభ్యర్థులను  నిలబెట్టారు. ఈ క్రమంలోనే ఆయన అద్భుతమైన సెంటిమెంట్ రాజకీయం చేస్తూ సింపతిని పొందుతున్నారు. ఒక్క జగన్ ను ఓడించడానికి ఇంతమంది జత కట్టారు. వీరే కాకుండా నా కుటుంబం నుంచి కూడా  వ్యక్తులను తయారు చేశారు అంటూ  ఓటర్ల మనసులను ఆలోచింపజేసే మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పవచ్చు. అయితే జగన్ కు టిడిపి పొత్తే చాలా ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 పొత్తే ముంచుతోందా..
 ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 నియోజకవర్గాలు 25 అసెంబ్లీ స్థానాలలో  పొత్తుల్లో భాగంగా  టిడిపి 144, జనసేన 21, బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. లోక్ సభ స్థానాల్లో టిడిపి 17, జనసేన 2, బిజెపి 6 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పిఠాపురం, తెనాలిలో పోటీ చేసే పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప  మిగతావారు ఎవరైనా సరే అంతగా పోటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.  అలాగే మిగిలిన స్థానంలో  టిడిపి నుంచి టికెట్ ఆశించి భంగ పడ్డ చాలా మంది నేతలు కూటమి నేతలకు సపోర్ట్ చేసే అవకాశం కనిపించడం లేదు.  దీనివల్ల టిడిపికి చాలా దెబ్బ పడే అవకాశం ఉంది. అలాగే కూటమి ద్వారా సీట్లు పొందినటువంటి బిజెపి జనసేన సీట్లు మొత్తం 31.  ఇందులో చాలావరకు వైసిపి విజయకేతనం ఎగరవేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ టిడిపి సొంతంగా పోటీ చేసి ఉంటే మాత్రం  కాస్తో కూస్తో ఇక్కడ  సీట్లు సంపాదించుకునే అవకాశం ఉండేది. అంతేకాకుండా  ఇంకా 144 నియోజకవర్గాల్లో  ఎన్నో కొన్ని సీట్లు వచ్చినా టిడిపికి బలం ఉండేది.  కానీ ఈ పొత్తుల వల్ల కేటాయించిన సీట్లలో విపరీతమైన ఎఫెక్ట్ ఏర్పడుతుందని, మరోవైపు వీరు పొత్తుల రాజకీయాన్ని వాడుకొని  వైసీపీ సింగిల్ గా పోటీ చేసి గెలుపు తీరాలకు వెళుతుందని చెప్పవచ్చు.

 ప్రజల ఆలోచన:
 ఆంధ్రప్రదేశ్ లోని చాలామంది ప్రజలు  టిడిపిని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం  పొత్తు. ఈ పొత్తుల వల్ల వీరు  గెలిచిన ప్రభుత్వం సాఫీగా సాగే అవకాశం కనిపించడం లేదు.  గెలిచిన తర్వాత వీరంతా పదవుల కోసం కొట్టుకుంటారని ప్రజాపాలన మరిచి పోతారనే అపోహ కూడా జనాల్లోకి వెళ్తోంది. ఇన్ని మైనస్ ల మధ్య  అందరికీ ఆత్మీయంగా కనిపించేది వైసిపి మాత్రమే..దీంతో వైసిపి గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. మరి దీనిపై చంద్రబాబు ప్రధానంగా దృష్టి పెట్టి   ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా హామీ ఇస్తే గానీ టిడిపి నావ నడిచేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: