రాష్ట్రంలో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలలో టెన్షన్ టెన్షన్.గెలుపే ధ్యేయంగా వైసీపీ అలాగే కూటమి ఒకరిని మించి ఒకరు ఎత్తుకుపై ఎత్తు వేసుకొని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే అద్దంకి,చీరాల,పర్చూరు నియోజకవర్గాలలో వైసీపీ గెలుపు అనేది అసాధ్యం అని తెలుస్తుంది.అయితే ఆ మూడు సీట్ల విషయంలో 2019ఎన్నికల్లో కొంత డిస్టర్బన్స్ చోటుచేసుకోవడం వల్ల వైసీపీ కి అక్కడ పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.దాంతో ఈ ఎన్నికల్లో వైసీపీ అక్కడ గెలిచే దిశగా ప్రణాళిక వేసుకున్నప్పటికి అక్కడ గెలుచే అవకాశాలు తక్కువ అనే సర్వేలు చెప్తున్నాయి.

అయితే పర్చూరు నియోజకవర్గం విషయానికి వస్తే 2014 మరియు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దిగా ఉన్న ఏలూరి సాంబశివరావు గారు గెలిచారు.వైసీపీ అధిష్టానం పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే చాలా మంది ఇంచార్జిలను మార్చింది. మొదట్లో ఆమంచి కృష్ణమనోహర్ ఇంచార్జిగా నియమించగా కొన్ని రోజుల్లోనే తన వ్యక్తిగత కారణాల వల్ల మరలా ఆయనని చీరాల నియోజకవర్గనికే ఇంచార్జి గా చేసారు.తర్వాత మరలా ఎడం బాలాజీ గారిని పర్చూరు ఇంచార్జిగా చేసారు.ఆయన కూడా పర్చూరులో ఇమడ లేకపోతున్నారు. వైసీపీ గెలుపు కోసం ఎన్నీ ప్రణాళికలు వేసుకున్న టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావును ఢీ కొట్టే దమ్ము వైసీపీలో కనబడుటలేదు.గ్రౌండ్ లెవెల్ లో వైసీపీకి అక్కడ పట్టు ఉన్నప్పటికీ సరైన లోకల్ నాయకుడు లేకపోవడం వల్ల అక్కడ ఈసారి కూడా అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ ఖచ్చితం అని తెలుస్తుంది.దానికి తోడు ఏలూరి సాంబశివరావు ప్రజలతో మమైకం అయి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం ఆయనకు బాగా కలిసోచ్చింది.చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాలలో కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతుంది.ఏదేమైనా అధికార పార్టీ ఇంచార్జెస్ ను మార్చడం కొత్తవారిని నియమించడం లాంటి పనులు చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: