ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గ్రాఫ్ పెరుగుతోందా? తగ్గుతోందా? అనే ప్రశ్నకు తగ్గుతోందనే సమాధానం వినిపిస్తోంది. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలలో వైసీపీకే అనుకూల ఫలితాలు రానున్నాయని ఉమ్మడి ఒంగోలులో కూడా వైసీపీ సత్తా చాటననుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఆ రెండు పత్రికలే టీడీపీకి మేలు చేయనున్నాయని తెలుస్తోంది.
 
అయితే ఆ పత్రికలు రాస్తున్న రాతలను నమ్మేవాళ్లు మాత్రమే లేకపోవడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి స్టార్ కాంపైనర్లు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అవుతోంది. కూటమి పుంజుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు మాత్రం వర్కౌట్ కావడం లేదు. 2019 ఎన్నికల సమయంలో ఆ పత్రికల వల్లే టీడీపీకి ఊహించని స్థాయిలో నష్టం కలిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
మరోవైపు కొంతమంది టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడుకే షాక్ ఇచ్చారు. మాడుగుల టికెట్ ను మరో అభ్యర్థికి ప్రకటించినా పైలా ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబుకే షాకిచ్చే విధంగా పైలా అడుగులు వేయడం గమనార్హం. పైలా ప్రసాదరావు రెబల్ గా నిలిస్తే టీడీపీ తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి.
 
ఎన్నికల సమయానికి రెబల్స్ నుంచి చంద్రబాబుకు మరిన్ని షాకులు తప్పవని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయగా ఆయన ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలుగా ఉంది. ఐదేళ్లలో చంద్రబాబు ఆస్తుల విలువ 39 శాతం పెరగడం గమనార్హం. చంద్రబాబుపై ఉన్న కేసుల విషయానికి వస్తే ఆయన పేరుపై 24 కోట్ల రూపాయల క్రిమినల్ కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పేరుపై భారీ స్థాయిలో ఆస్తులు ఉండగా భువనేశ్వరి పేరుపై కూడా రికార్డ్ స్థాయిలో ఆస్తులు ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. కూటమికి ఏపీలో అనుకూల ఫలితాలు వస్తాయో లేక షాకింగ్ ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: