రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమనే సంగతి తెలిసిందే. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు ఉన్నారనే ప్రశ్నకు ఉద్యోగులలో సగం మంది వైసీపీకి అనుకూలంగా ఉంటే చాలామంది కూటమికి అనుకూలంగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సీపీఎస్ హామీ అమలు సాధ్యం కాదు కాబట్టి ఆ దిశగా ఏ రాజకీయ పార్టీ అయితే హామీ ఇవ్వడం లేదు.
 
గ్రామ, వార్డ్ సచివాలయాలు ఉద్యోగులు మాత్రం వైసీపీకి ఒకింత అనుకూలంగా ఉండటం గమనార్హం. వైసీపీ గ్యారంటీ పెన్షన్ విధానం అమలు చేస్తామని చెబుతుండగా పాత పెన్షన్ విధానం మాత్రమే అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైసీపీ మంత్రి పేర్ని నాని తాజాగా మాట్లాడుతూ జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడూ అన్యాయం చేయలేదని అన్నారు. జగన్ సర్కార్ ఉద్యోగులను ఎప్పుడూ వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారు.
 
జగన్ సర్కార్ పాలనలో మాత్రమే దాదాపుగా రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం జరిగిందని ఆయన వెల్లడించారు. గ్రామాల్లో జగన్ ఎన్నో సంస్కరణలను అమలు చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగులు అనుభవించిన ఇబ్బందులను గుర్తు చేసుకోవాలని ఆయన కామెంట్లు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు లేకపోతే గెలుపు కష్టమేనని వైసీపీ భావిస్తోంది.
 
ఎన్నికల సమయానికి ప్రభుత్వ ఉద్యోగుల మనస్సు ఏ విధంగా మారుతుందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల సపోర్ట్ ఎన్నికల ఫలితాలను కొన్ని నియోజకవర్గాల్లో మార్చేయగలదనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఏ పార్టీకి ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది. ఏపీలో ప్రతి ఓటు కీలకమే అవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇతర రాజకీయ పార్టీల నేతలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: