తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఎక్కువ మంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ వారిలో చాలా శాతం మంది తెలంగాణలోని హైదరాబాదులో సెటిల్ అయ్యారు. దానితో వారిలో కొంతమంది ఇప్పటికీ సొంత ఊళ్ళలోనే ఓటు హక్కును వినియోగించుకుంటే ఉంటే మరి కొంతమంది మాత్రం హైదరాబాదులో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన వారు ఎంతోమంది ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి ఫుల్ సక్సెస్ అయిన వారు ఉన్నారు.

మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే విజయభేరిని మోగించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆ తర్వాత తన కుమారుడు అయినటువంటి బాలకృష్ణ ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం అనే పార్టీని కూడా స్థాపించాడు. అందులో భాగంగా చిరంజీవి ఎమ్మెల్యే కూడా అయ్యాడు.  ప్రస్తుతం తన తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని స్థాపించి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి తహతహలాడుతున్నాడు.

ఇలా సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీఎం స్థానానికి చేరుకోకపోయిన కూడా కొంతమంది మామూలు నటులు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి మంత్రులుగా కూడా పని చేసిన వారు ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు ఎంతోమంది రాజకీయాల్లోకి రావాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ ఎలక్షన్ల టైం వచ్చేసరికి మాత్రం మేము ఎవరి సైడు ఉండబోతున్నాం అనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితమే తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అందరూ వ్యక్తులు గప్ చుప్ అయ్యారు. ఇక ఆంధ్ర ఎలక్షన్ల సమయంలో వీరిలో చాలామంది బయటకు వస్తారు అని జనాలు అనుకున్నారు.

ఇప్పటివరకు ఎవరు బయటకు వచ్చింది లేదు. పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆయనను బాగా అభిమానించే జబర్దస్త్ కమెడియన్లు కొందరు ఆయన తరపున ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారాలు చేస్తున్నారు. అంతకుమించి ఎవరు బయటకు రావడం లేదు. ఇక కొంతమంది అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఎవరికి పెద్దగా క్లారిటీ లేదు. ఒక వేళ ఒకరి వైపు ఉన్నట్లు అయితే మరొక పార్టీ గెలిస్తే తమ జీవితాలకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా..? అనే ఉద్దేశంతో కొంతమంది ఎలక్షన్లకి ఉంటున్నట్లు... మరి కొంతమంది మనకు ఈ రాజకీయాల్లో ఎందుకు మన పని మనం చేసుకుందాము అని మరికొందరు అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇలా వివిధ కారణాల వల్ల ఎలక్షన్ల సమయంలో సినీ ప్రముఖులు ఎవరు బయటకు వచ్చి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap