నోటి మాటకు మించిన ప్రమాదకరమైన అంశం మరొకటి ఉండదన్న విషయాన్ని వేల పుస్తకాల్ని మధించిన కేసీఆర్…అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఓటమి తాలుకూ ఫ్రస్టేషన్ లో తనకున్న జ్ఞానాన్ని మిస్ అయ్యరేమో అనిపిస్తోంది. తానేం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని మరిచిపోతున్నారు అనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.


తాజాగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు ఆయన ఇమేజ్ ని దెబ్బతీసేవే కానీ.. ఏమాత్రం ఆయన స్థాయికి తగిన మాటలు కాదు. కాకపోతే గులాబీ బాస్ గొప్పతనం ఏంటంటే.. అబద్ధాన్ని సైతం నిజమని నమ్మించేలా భావన కలిగిస్తారు. ఇది ఆయన ప్రత్యేక టాలెంట్. తాజాగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం లో మాట్లాడిన కేసీఆర్ చెలరేగిపోయారు. సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.


ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు సాగుతున్నాయి. అయితే తనకే ఓ ఎమ్మెల్యే టచ్ లోకి వచ్చారని 20మందికి పైగా వస్తానంటే తానే వద్దని వారించినట్లు చెప్పుకొచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ లో బీజేపీ నాయకుల పెత్తనం ఉందని బాంబు పేల్చారు. ఇది తమకు నచ్చడం లేదని కేసీఆర్ తో చెప్పి వాపోయారు అంట. ఇది నిజంగా నమ్మే విధంగా ఉందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.


బీజేపీ, కాంగ్రెస్ లు జాతీయ స్థాయిలో శత్రువులు. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ప్రభావం ఉంటుందంటే ఎవరైనా నమ్ముతారు కానీ.. జాతీయ స్థాయి విరోధులైన కాంగ్రెస్ లో ఆ పార్టీ పెత్తనాన్ని ఎవరూ నమ్మరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని భావన కల్పించి కాంగ్రెస్ లాభ పడింది. ఇప్పుడు కేసీఆర్ ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ పై వదులుతున్నారు. కాకపోతే ఇది వంద శాతం జరిగే పని కాదని.. ఇలాంటి వ్యాఖ్యలు కేసీఆర్ పై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: