కొన్నిసార్లు రాజకీయాల్లో అభ్యర్థుల బలం కన్నా ప్రత్యర్థుల బలహీనత.. వల్ల రాజకీయాలు కొన్నిసార్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి అనంతపూర్ అర్బన్ లో ఏర్పడుతోంది. ఒకప్పుడు టిడిపిలో అందరూ కలిసిమెలిసి ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితి చాలా మారిపోయింది. ముఖ్యంగా జెసి బ్రదర్స్ ను పార్టీలోకి తీసుకున్న తర్వాత టిడిపిలో రెండు వర్గాలుగా విడిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. జేసీ బ్రదర్స్ వల్ల టిడిపికి మేలు లేకపోగా కీడుగానే మారిందట.


2014 ఎన్నికలలో చాలా కష్టం మీద టిడిపి పార్టీ గెలిచింది. 2019 వచ్చేసరికి చాలా దారుణంగా ఓడిపోయింది. అందుకు  గల కారణం సొంతనేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉండడం వల్ల ఇలా జరిగిందని వాదనలు వినిపించాయి.. 2014లో ప్రభాకర్ చౌదరి 9 వేల మెజారిటీ ఓట్లతో గెలిచారు. కానీ జేసీ బ్రదర్స్ తో ప్రభాకర్ చౌదరికి ఇబ్బందిగా మారిందట. అలా ఐదేళ్లు నెట్టుకొచ్చినప్పటికీ 2019లో ప్రభాకర్ చౌదరి ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు కూడా బాగానే ఫాలోయింగ్ ఉన్నది.


నియోజవర్గంలో కూడా భారీగానే పేరు సంపాదించారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్తూ వివరిస్తూ ఉన్నారు. యువతను కూడా ఆకట్టుకోవడంలో వెంకటరామిరెడ్డి బాగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైసీపీలో అసంతృప్తులు లేకపోవడం అక్కడి నాయకులకు బాగా కలిసి వస్తోంది. టిడిపి విషయానికి వస్తే ఒత్తులో భాగంగా జనసేనకు అనంతపూర్ టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ ఆ తర్వాత బిజెపికి ఇస్తామని ప్రకటించారు. దీంతో చాలా రోజులపాటు క్లారిటీ లేకపోయింది. చివరికి టిడిపికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అలా ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.దీంతో ఒక్కసారిగా టిడిపి పార్టీలో మరొకసారి అసంతృప్తులు బయటపడ్డాయి. చౌదరి వర్గీల సైతం నానా హంగామా చేస్తూనే ఉన్నారు. ఇలా టిడిపిలో అంతర్గత విభేదాలు వల్ల ఈ సీటు వైసీపీకి పాలు పోసి ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: