సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు.. అలాగే ఇటీవలే బి- ఫాం కూడా చంద్రబాబు చాలామంది నేతలకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బి- ఫాం ఇస్తూ అభ్యర్థులను చంద్రబాబు తమ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలలోకి తీసుకువెళుతూ అలాగే తమ ప్రభుత్వం వస్తే ఎలా జరుగుతుంది..వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలను తెలియజేస్తూ దూసుకుపోండి అంటూ  పలు రకాల దిశా నిర్దేశాలు ఇచ్చారు చంద్రబాబు. అయితే అనంతపురం జిల్లాలో పలు రకాల నియోజకవర్గాలలో బి - ఫాం నేతలకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరికి ఇచ్చారు చూద్దాంబి - ఫాం ఇచ్చిన అభ్యర్థులంతా విజయంతో తిరిగి రావాలంటు చంద్రబాబు సూచిస్తూ నిన్నటి రోజున ఉండవల్లిలో చంద్రబాబు తన నివాసంలో సార్వత్రిక ఎన్నికలు పోటీ చేసే పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు బి - ఫాం అందజేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ టిడిపి విజయం కోసం కృషి చేయాలి అంటూ వారితో ప్రతిజ్ఞ చేయించారు చంద్రబాబు. బి - ఫాం అందుకున్న వారి విషయానికి వస్తే అనంతపురం పార్లమెంటు పరిధిలో.. అంబిక లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థి.. అమిలినేని సురేంద్రబాబు (కళ్యాణ్ దుర్గం), బండారు శ్రావణి (సింగనమల), హిందూపూర్ పార్లమెంటు ఎంపీ బీకే పార్థసారథి, దగ్గుబాటి ప్రసాద్ (అనంతపురం అర్బన్), ఎమ్మెస్ రాజు (మడకశిర), బాలకృష్ణ (హిందూపురం అసెంబ్లీ), సింధూర రెడ్డి (పుట్టపర్తి)..


వీరితోపాటు తదితర నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 20 రోజులు నిత్యం ప్రజలలోనే ఉండాలంటూ బాబు అభ్యర్థులను సూచించారు. ముఖ్యంగా ఐదేళ్ల పాలనలో వైసిపి చేసిన  అరాచకాలను విధ్వంసమైన పాలనను ప్రజలకు వినిపించాలంటు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేదనీ తెలియజేస్తూ..ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలకు సైతం చంద్రబాబు సూచించారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల కూటమిలో భాగంగా సీట్లు మార్చడంత టిడిపి నేతలు మధ్య పలు రకాల విభేదాలు అయితే తలెత్తుతున్నాయి. అయితే వీటన్నిటిని చంద్రబాబు మాత్రం లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: