ఏపీలో ఇదివరకు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది అనేది చాలా ఈజీగా చెప్పేవారు. కానీ ఈ ఎన్నికలు మాత్రం  చాలా కఠినంగా సాగుతున్నాయి. అసలు ప్రజలు ఏ వైపు ఉన్నారో చెప్పడం కూడా కష్టంగా మారింది. కొన్ని సర్వేలు అధికార వైసిపి పార్టీ మళ్లీ గెలుస్తుందని చెబుతుండగా,మరికొన్ని సర్వేలు టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. కానీ ఎవరు గెలిచినా  క్యాండిడేట్లకు మెజారిటీ అయితే రాదని వందల ఓట్ల తేడాతోనే గెలుస్తారని  సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. ఇదే తరుణంలో 2024  ఏపీలో టైట్ ఫైట్ గా మారింది. ఇక అధికార వైసిపి ఎలాగైనా ఈ ఎన్నికలలో మరోసారి గెలిచి తమ సత్తా చాటాలని కంకణం కట్టుకుంది. ఇక పోయిన ఎన్నికల్లో పరాభవం పొందిన టిడిపి  ఈ ఎన్నికలను జీవన్మరణ పోరుగా భావించాయి. 

 ఎలాగైనా జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు సెగ్మెంట్లలో వైసిపి, టిడిపి అభ్యర్థులు హోరాహోరిగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరు గెలుస్తారు అనేది సరైన అంచనా ఇంకా రావడం లేదు. ఎన్నికలకు ఇంకా 21 రోజులు సమయం మాత్రమే ఉంది. ఇందులో ఎన్నికల రోజు వదిలిపెడితే ఇంకా 20 రోజులే ఉంది.ఈ రోజుల్లో ఏమైనా మార్పు వస్తుందా లేదంటే ఇలాగే టైట్ పొజిషన్ కొనసాగుతుందా అనేది అంతుచిక్కడం లేదు.  175 నియోజకవర్గాలలో ఈ మూడు నియోజకవర్గాలు వీరికి కంచుకోటగా ఉంటాయి. పోయిన ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల్లో వీరు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి వీరికి  మెజారిటీ భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆ నియోజకవర్గాలు ఏంటయ్యా అంటే..

కుప్పం,  పులివెందుల, హిందూపూరం..ఈ నియోజకవర్గాల్లో 2019లో భారీ మెజారిటీతో ఈ నాయకులు గెలిచారు. కానీ ఈసారి కనీసం కనీస మెజారిటీ కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో జగన్ పులివెందులలో 90 వేల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈసారి జగన్ కి 30 వేల మెజారిటీ కూడా వచ్చేలా కనిపించడం లేదు. చంద్రబాబు 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి దాదాపు 46వేల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఈయనకు భారీగా మెజారిటీ తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక హిందూపూరం లో బాలకృష్ణ 2014, 2019 ఎన్నికల్లో  కనీసం 10,000 మెజారిటీ పైన  ఓట్ల మెజారిటీతో  గెలుపొందారు. అయితే ఈసారి ఆయనకు  మెజారిటీ ఏమో కానీ గట్టి  ఫైట్ ఉండేలా కనిపిస్తోంది. ఇక వీళ్లే కాకుండా  చాలామంది అభ్యర్థుల మధ్య వందల ఓట్ల తేడాతోనే గెలుపోటములు ఉంటాయని రాజకీయ పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: