జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో రకాల అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ నేతలు కార్యకర్తలే సైతం పవన్ కళ్యాణ్ ని తిట్టే పరిస్థితి ఏర్పడింది. గత కొన్నేళ్లుగా జనసేన నేతగా పోతిన వెంకట మహేష్ ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. అయితే ఇటీవల కొన్ని కారణాల చేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పలు సంచలనం వ్యాఖ్యలు చేసి వైసిపి పార్టీలోకి చేరారు. దీంతో ఒక్కసారిగా వైసిపి పార్టీ నుంచి మహేష్ పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు.


ప్రతిసారి మీడియాలో పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తల చేతిలో టార్గెట్ గా అయ్యారు మహేష్.. అయితే ఈసారి ఏకంగా జనసేన పార్టీని వీడుతున్న నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పైన తాజాగా విమర్శలు చేయడం జరిగింది మహేష్.. "తనపై జనసేన చెంచాలు అరవమనే బదులుగా మీ పార్టీని వదిలిపోతున్న నాయకులను కాపాడుకోండి ఈసారైనా విజిటర్ పాసు లేకుండా అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా చూడండి పవన్ కళ్యాణ్ గారు అంటూ తన ట్విట్టర్ నుంచి పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది".


గతంలో జనసేన పార్టీ నుంచి మహేష్ పోతిన విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ కూటమిలో భాగంగా ఆయనకు జనసేన పార్టీ నుంచి సీటు రాలేదు. దీంతో తీవ్రమైన మనస్థాపానికి గురైన మహేష్ వైఎస్ఆర్సిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పైన ఏదో ఒక విమర్శలు చేస్తూ హైలెట్ అవుతున్నారు. దీంతో ఒక్కసారిగా జనసేన నేతలు కార్యకర్తలు కూడా మహేష్ పైన ఆగ్రహాన్ని తెలపడంతో సోషల్ మీడియాలో అందరికీ దిమ్మతిరిగేలా ట్వీట్ చెసి జనసేన నేతలు కార్యకర్తలను సైతం తల పట్టుకునేలా చేస్తున్నారు. అందుకు సంబంధించి ట్వీట్ కూడా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: