•విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు 
•పవన్ కళ్యాణ్ పై విశాఖ జనసేన నేతలు ఫైర్ 
•జెండా ఏనాడూ పట్టుకోని నేతకు టికెట్ ఎలా ఇస్తారంటున్నా జనసేన నేతలు 


కష్టపడి జనసేన కోసం పనిచేసిన వారికి అన్యాయం చేసినందుకు పవన్ కళ్యాణ్ పై ఆయన తీరుపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖ నుంచి జనసేన నేతలు పవన్ పై మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని తన స్థావరంగా చేసుకుని రెండు ఎన్నికల్లో వరసగా రెండు పార్టీల నుంచి పోటీ చేసినా కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు వంశీకృష్ణ శ్రీనివాస్.ఆయన 2009 వ సంవత్సరంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేస్తే జస్ట్ మూడు వేల తేడాతో ఓడిపోగా... అదే వంశీ వైసీపీ నుంచి 2014లో పోటీ చేస్తే ఏకంగా 47 వేల భారీ తేడాతో ఓటమి పాలవ్వడం జరిగింది. 2019 నాటికి అంతా అనుకూలం అనుకుంటే ఆయనకు టికెట్ మాత్రం దక్కలేదు. ఆ ప్లేస్ లోకి కొత్తగా వచ్చిన అక్రమాని విజయనిర్మలకు టికెట్ ని ఇచ్చేశారు. అలా జగన్ ప్రభంజనంలో గెలిచే ఛాన్స్ ఉంటే టికెట్ దక్కలేదు.


ఇక 2024 ఎన్నికలలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వైసీపీ అధినాయకత్వం విశాఖ తూర్పు టికెట్ ని ఇచ్చేసింది. దాంతో వంశీ విసిగిపోయి జనసేన పార్టీలో చేరారు. అయితే జనసేన టీడీపీ పొత్తు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబుని కదపడం కష్టం కాబట్టి వంశీకి విశాఖ దక్షిణం సీటుని చూపించడం జరిగింది. కానీ ఆ సీటుకు మాత్రం ఆయన కొత్త.దాంతో పాటు జనసేన పార్టీలో ఉన్న నేతలు అంతా వంశీ రాక మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి వారంతా వరసబెట్టి వైసీపీలో చేరిపోయారు. సౌత్ లో జనసేన పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలు ఇపుడు వైసీపీ జెండా పట్టుకున్నారు. టీడీపీకి గట్టి పట్టు ఉన్న ఈ సీటులో ఆ పార్టీ సహకారం కూడా లేదు.దాంతో వంశీ విశాఖ దక్షిణం నుంచి గెలవడం మీద కూటమిలోనే చర్చ అనేది సాగుతోంది. జనసేన నేతలు వంశీని తమవాడిగా భావించకపోగా జెండా ఏనాడూ పట్టుకోని నేతకు టికెట్ ఎలా ఇస్తారా అని హై కమాండ్ మీద ఇంకా పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. అసలు పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఎవరికి పడితే వారికి టికెట్ ఎలా ఇస్తారాని పవన్ పై మండిపడుతున్నారు. కూటమి కూటమి అంటూ పచ్చ జెండా ఊపుతున్నాడు తప్ప తమని గుర్తించట్లేదని జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: