అనంతపూర్ జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం అంటే పరిటాల కుటుంబానికి కంచుకోట. అయితే గత ఎన్నికలలో ఈ కంచుకోటని అనూహ్యంగా  తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బద్దలు కొట్టారు. గతంలో రెండుసార్లు ఓడిపోయిన సింపతితో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పాతికవేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇలా దీనంగా అడిగినందువల్లే ఆయన విజయం అందుకున్నారని సమాచారం. కానీ ప్రజలు తనకు పోగొట్టుకున్నదంతా సంపాదించుకునేందుకే అవకాశం ఇచ్చారనేంతగా ఐదేళ్లలో ఆయన పనితీరు కొనసాగిందని వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా దోచుకోవడం దాచుకోవడం అప్పుల పాలయ్యా అని చెప్పుకున్న ఈయన ఇప్పుడు దాదాపుగా 1000 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు సమాచారం. ఆయన కుటుంబంలోని వారంతా కూడా కుబేరులయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ బ్రాండ్ అయినా జాకీ కంపెనీ రాప్తాడులో పరిశ్రమ రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కమిషన్ ఇవ్వలేదని కూడా బెదిరించి వెనక్కి పంపించారని వార్తలు వినిపించాయి. దీంతో కొన్ని వందల మందికి ఉపాధి లేకుండా చేశారని సమాచారం. ఒకప్పటి రాప్తాడు ప్రకాష్ రెడ్డి అడ్డాగా మారిపోయింది.


అయితే పరిటాల సునీత ఎప్పుడు గెలిచినా కూడా టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమె నియోజకవర్గంలో బాగా పనులు జరిగేవి. వైసీపీ నేతలు కూడా బాగా దర్జా గానే ఉండేవారు. కానీ గత ఐదేళ్ల పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది.. దీంతో ప్రభుత్వం మారితే కానీ మా పరిస్థితి మారేలా కనిపించడం లేదనేంతగా  వైసిపి నేతలు భయపెట్టేలా చేస్తున్నారట. దీంతో కొంతమంది టీడీపీ పార్టీలోకి కూడా చేరిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సునీతమ్మ గత ఎన్నికలలో ఓడిపోయిన సానుభూతి వైసిపి పార్టీ పైన ఉన్న వ్యతిరేకత రాప్తాడు అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడంతో పరిటాల సునీత పైన ఈసారి ప్రజలు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జనసేన పార్టీతో పొత్తు కూడా ప్లస్ అవుతుందని టిడిపి నేతలు తెలుపుతున్నారు. ముఖ్యంగా తన సొంత గ్రామానికి ఐదేళ్ల లో రోడ్డు వేయలేకపోయారనే అసంతృప్తి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన  ప్రజలలో కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈసారి సునీతమ్మ మెజారిటీతోనే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: