•ఐరన్ లెగ్ అనిపించుకున్న చోటే గోల్డెన్ లెగ్

•విమర్శించిన చోటే ప్రశంస

•హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న రోజా


(అమరావతి - ఇండియా హెరాల్డ్ )
రోజా.. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకుని ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.. సొంత పార్టీ వాళ్లే విమర్శించినా.. అన్నింటినీ చక్క పెట్టుకుంటూ మంత్రిగా నేడు కొనసాగుతుండడం చూస్తుంటే ఆమె ఏ రేంజ్ లో కష్టపడి పైకి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా వండర్ ఉమెన్ అనిపించుకుంది రోజా. మరి ఈమె సినిమా రంగం నుంచి మంత్రిగా మారిన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. 2004,  2009 శాసనసభ ఎన్నికల్లో నగరి,  చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండుసార్లు కూడా ఓడిపోయింది.  అయితే 2014 శాసనసభ ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో నుంచి వైయస్సార్సీపి తరఫున పోటీ చేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు పై 858 ఓట్ల తేడాతో గెలుపొందింది..

 2014 నవంబర్లో నగరి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేసిన ఈమె ఎమ్మెల్యేగా గెలుపొందింది ఇక 2019లో కూడా రెండోసారి గెలిచి 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.  ఏప్రిల్ 13న పదవీ బాధ్యతలు చేపట్టింది ఈ ముద్దుగుమ్మ..

ఇకపోతే గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి పేరు ఉంది.. స్థానికంగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. అలాంటి వారి పైన ఈమె ఏకంగా రెండుసార్లు గెలవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. నిజానికి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు రాజకీయంగా రాణించాలి అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.. అలాంటిది రోజా అన్నింటిని ఎదుర్కొంది ..మొదట టిడిపిలో చేరినప్పుడు రెండుసార్లు ఓడిపోతే అప్పుడు సొంత పార్టీ వాళ్లు ఈమెను ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. ఇక తర్వాత వైసిపి పార్టీలోకి చేరిన ఈమె .. తనను ఐరన్ లెగ్ అంటూ సంబోధించిన వారికి ఎదురొడ్డి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి.. ఏకంగా మంత్రి పదవిని దక్కించుకుంది. ఇక తనపై విమర్శించిన వారి నోట వింటే ప్రశంసలు అందుకుంది రోజా.

అటు సినిమా రంగంలో కూడా సక్సెస్ సాధిస్తూ ఇటు బుల్లితెర రంగంలో మరిన్ని విజయాలనందుకుంటూ ఇప్పుడు రాజకీయంగా కూడా తన సత్తా చాటుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నగరి నుంచి పోటీ చేస్తున్న ఈమె హ్యాట్రిక్ విజయం వైపు అడుగులు వేస్తోంది.. మరి ఈ హ్యాట్రిక్ విజయం నగరి నియోజకవర్గ రూపంలో రోజాకు లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది...

మరింత సమాచారం తెలుసుకోండి: