గత కొద్దిరోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ పైన పలు రకాల కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయం పైన పలువురు వైసిపి నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బాగా పిచ్చి ముదిరినట్టుగా కనిపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా పవన్ మాట్లాడుతున్న భాష రెచ్చిపోవడం ఇదంతా కేవలం పిచ్చికి సంబంధించిన లక్షణం అంటూ కూడా తెలియజేశారు. భీమవరం సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గ్రంధి శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి మరి కౌంటర్ ఇచ్చారు.



నాయకుడు లక్షణాలు అసలు ఇలా ఉంటాయా ఆకురౌడీల పవన్ వ్యవహరిస్తున్నారు అంటూ గ్రంధి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.. ముఖ్యంగా ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని చిరంజీవి ముందు పవన్ ను ఏదైనా హాస్పిటల్ కి వెళ్లి చూపించాలంటూ వెల్లడించారు.. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి లాంటి వ్యక్తి రాజకీయాలకు విలువలేవు ఎప్పటికప్పుడు ఎలా అయినా మారుతూ ఉంటారంటూ తెలిపారు గ్రంధి శ్రీనివాస్. గతంలో తనను తిట్టిన వ్యక్తికే ఇప్పుడు టికెట్టు ఇచ్చారు.. తన తల్లిని తిట్టిన వ్యక్తులతోనే జత కడుతున్నారు అంటూ అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అంటూ తెలియజేశారు గ్రంధి శ్రీనివాస్.


పవన్ అన్న చిరంజీవి సైతం తనను నమ్మిన వాళ్లను నిండా ముంచేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్మేశారు.. కేవలం కేంద్ర మంత్రి పదవి కోసమే ఇదంతా చేశారంటూ వెల్లడించారు. చిరంజీవి పక్క కమర్షియల్ లాంటి వ్యక్తి అని.. తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇప్పుడు పవన్ కి మద్దతిస్తున్నారు.. కానీ పవన్ మాత్రం తన పార్టీని హోల్సేల్గా టిడిపికి అమ్మితే ఒక్కసారి డబ్బులు వస్తాయి.. కానీ ప్రతి ఎలక్షన్స్ కు సైతం అమ్మితే డబ్బులు చాలా వస్తాయని పవన్ ఒక కమర్షియల్ వ్యాపారిగా మారిపోయారంటూ తెలిపారు గ్రంధి శ్రీనివాస్.


2019-24 మధ్యకాలంలో భీమవరంలో కంఫర్ట్ యార్డు కట్టడానికి  భూమి కూడా సేకరించామని.. రైతులకు కూడా డబ్బులు ఇచ్చామంటూ ఈ విషయాన్ని ఎన్నోసార్లు ప్రజలకు కూడా తెలియజేశామని.. కానీ పవన్ కళ్యాణ్ పిచ్చి తో అజ్ఞానంతో నానా మాటలు మాట్లాడుతున్నారు.. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న అంజిబాబు తన నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.. ఇప్పుడు మళ్ళీ జనసేన తరఫున పోటీ చేస్తూ ఉన్నారంటూ గ్రంధి శ్రీనివాస్ తెలియజేశారు. పవన్ ఏమి తెలియకుండా ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు ఇదే పవన్ పిచ్చికి నిదర్శనం అంటూ కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: