ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంటాయి.  ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చతురత కలిగిన వ్యక్తులని అంటుంటారు. వీరు ఎన్నుకునే నాయకుడిని ఆచితూచి ఎన్నుకుంటారనే  ఒక టాక్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ టాక్ అనేది 2019 ఎన్నికల వరకు నడిచింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో చాలా డిఫరెంట్  స్ట్రాటజీ జనాలు ఉపయోగిస్తున్నారు. రాజకీయ నాయకులు ఏ విధంగా వారి అవసరాల తీరు పార్టీలు మారుతున్నారో జనాలు కూడా ఏదో ఒక పార్టీ అంటూ ఉండటం లేదు.  వారి అవసరాలు ఎవరు తీరిస్తే వారికి తప్పక ఓటేస్తున్నారు. ఏ పార్టీ సభ పెట్టిన 100% హాజరవుతున్నారు. 

ఓటు వేసే విషయంలో మాత్రం తనకి నచ్చిన నాయకుడికే వేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా జగన్ సభకి  జనాలు రావట్లేదని వారికి షిఫ్ట్ ల వైజ్ గా  ఒక్కొక్కరికి 300 రూపాయలు ఇస్తేనే జనం కనబడుతున్నారని జగన్ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఓవైపు  సభలకు జనం రావట్లేదు అంటూనే, వేలాది మందిని డబ్బులు ఇచ్చి తీసుకువస్తున్నారని మరో ఆరోపణ చేస్తున్నారు. అసలు సభకి జనం రావట్లేదు అన్నది ఒక ఎత్తు అయితే డబ్బులు ఇస్తే వస్తున్నారన్నది మరో ఎత్తు. అసలు సభకి జనం వస్తున్నారా లేదా అనేది ప్రత్యర్థులకే క్లారిటీ లేదు. డబ్బులు ఇచ్చి తీసుకు వస్తున్నారని వారే అంటున్నారు.

అసలు సభల్లో జనాలు కనిపించడం లేదని వారే అంటున్నారు. అంతేకాకుండా స్వచ్ఛందంగా చంద్రబాబు సభలకు జనాలు వస్తున్నారని వారికి వారే చెప్పుకుంటున్నారు. మరోవైపు వైసీపీ నాయకులేమో  చంద్రబాబు సభల్లో జనాలు కనిపించడం లేదని, జగన్ సభకు జనాలు తండోపతండాలుగా వస్తుంటే ఓర్వలేని వారు  రకరకాల కుయుక్తులు పన్నుతూ  ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విధంగా వైసీపీ, టీడీపీ మధ్య ఓ రాజకీయ యుద్ధమే నడుస్తోంది. కానీ ఈ ఇద్దరి మధ్యలో జనాలు మాత్రం వారి సపోర్టు ఎవరికి ఇస్తారు అనేది ఏ కోణాన కూడా బయట పెట్టడం లేదు. చివరికి ఎన్నికల  రిజల్ట్ వచ్చేవరకు ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: