సార్వత్రిక ఎన్నికలతతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభం అయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. అంటే ప్రభుత్వానికి కేవలం ప్రేక్షక పాత్ర. ఎలక్షన్ కమిషన్ సుప్రీం.  ఎవరు అవునన్నా కదన్నా.. ఎన్నికల సంఘం కేంద్రానికి కాస్తా అనుకూలంగా ఉంటుంది. ఈ విషయం తెలిసిన 40 ఇయర్స్ ఇండస్ర్టీ చంద్రబాబు ఎన్డీయేతో పొత్తు కోసం తహతహలాడారు.


చివరకు తాను అనుకున్నది సాధించి ఎలాగోలాగా కూటమిలో చేరిపోయారు.  ఇలా  ఎందుకు చేరారంటే కేంద్రాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు అనేది ఆయన వ్యూహం. తద్వారా ఏపీ ఎన్నికల్లో పైచేయి సాధించవచ్చు. పోల్ మేనేజ్ మెంట్ లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు. సహజంగా రాష్ట్ర అధికారులు ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంటారు. ఇది చంద్రబాబు హయాంలో కూడా జరిగింది.


కానీ టీడీపీ అధినేత అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎల్లో మీడియా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అందుకోసం వీరు ప్రస్తుతం ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకొని కథనాలు ప్రచురించడం మొదలు పెట్టారు. వైసీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకొని పనిచేస్తున్న దినపత్రికలు, టీవీలు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. అల్లర్లు చోటు చేసుకుంటున్నాయని.. అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కథనాలను ప్రచురిస్తోంది.


దీంతో వీటిని పట్టుకొని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈసీకి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారు. వారి తక్షణ ఉద్దేశం ఏపీలో డీజీపీని, సీఎస్ ని, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ చీఫ్ లతో పాటు ఒక పది మంది అధికారులను పక్కన పెట్టించి.. వారికి అనుకూలంగా ఉన్న వారికి ఆ బాధ్యతలను అప్పజెప్పాలి.  వీరిని పక్కన పెడితేనే ఏపీలో ఎన్నికలు సవ్యంగా సాగుతాయి అని అందులో పేర్కొంటుంది.  తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలి. అందుకే సీఎం కార్యాలయ అధికారులపై, ఐఏఎస్, ఐపీఎస్ లపై లేనిపోని కథనాలు రాస్తూ.. వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది.  మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: