ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది గ్రేట్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. కొంతమంది సైలెంట్ గా ఉంటూ తమ నియోజకవర్గానికి ఏమి కావాలో..? అక్కడి ప్రజలకి ఏమి అవసరమో వాటిని చేస్తూ కేవలం తమ నియోజకవర్గ ప్రజల్లో మాత్రమే క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమంది లీడర్లు ఉంటారు వారికి మాస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. పార్టీని గానీ... పార్టీ అధినాయకుడిని గాని ఎవరైనా ఎమైన అన్నట్లు అయితే వెంటనే వారు రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే తమ లీడర్ ని... తమ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం తమ మాటలతో అవతలి పార్టీ వ్యక్తులని ఆడేసుకుంటూ ఉంటారు.

దానితో జనాల్లో కూడా వారికి మాస్ ఇమేజ్ వస్తూ ఉంటుంది. రాష్ట్రంలో మంచి మాస్ ఇమేజ్ కలిగిన పొలిటికల్ లీడర్లలో కింజరపు అచ్చెన్నాయుడు ఒకరు. ఆయన 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కె.రేవతీపతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009లో రేవతీపతి ఆకశ్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన మరల రేవతీపతి భార్య అయిన కె.భారతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా గెలుపొందారు.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరార తిలక్ పై విజయం సాధించాడు. ఇక మరికొన్ని రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఈయన టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నాడు. ఇక ఈయనకు ఆపోజిట్ గా వైసీపీ పార్టీ నుండి దువ్వాడ శ్రీనివాస్ బరిలోకి దిగబోతున్నాడు. ఇలా ఇప్పటికే రెండుసార్లు గెలిచి పార్టీలో మంచి స్థానాన్ని దక్కించుకున్న ఈయన టీడీపీ పార్టీని గానీ తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబును కానీ ఎవరైనా ఏమైనా అంటే నిమిషాల్లో దానిపై రియక్ట్ అవుతూ ఉంటాడు.

అలాగే తన పార్టీని, తన వ్యక్తులను దూషించిన వారిపై తనదైన రీతిలో మాస్ రియాక్షన్ ఇస్తూ ఉంటాడు. దానితో ఈయనకు ఆయన నియోజకవర్గంలో మాత్రమే కాదు స్టేట్ అంత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని అభిమానించే వారిలో ప్రత్యేక ఇమేజ్ ఉంది. అలా తన మాస్ ఇమేజ్ తో ఈయన తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక సభ్యుడిగా మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kan