- తెలుగు ప్ర‌జ‌ల్లోనే తిరుగులేని మాస్ నేత‌గా గుర్తింపు
- ఎంపీటీసీ టు ఎమ్మెల్యే... మాస్ పీపుల్ ప‌ల్స్ బాగా తెలిసిన నేత‌
- దూకుడు స్వ‌భావంతోనే ఈ క్రేజ్‌.. అదే మైన‌స్ కూడా..!

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలో ఇంకా చెప్పాలంటే తెలుగు గ‌డ్డ మీద ఎంతో మంది మాస్ లీడ‌ర్లు ఉంటారు.. ఎంత మంది మాస్ లీడ‌ర్లు ఉన్నా కూడా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పేరు చెపితే ఏపీ మాస్ జ‌నాలు మాత్ర‌మే కాదు.. తెలంగాణ లో ఉన్న మాస్ జ‌నాలు కూడా ఉర్రూత‌లూగిపోతూ ఉంటారు. చింత‌మ‌నేని నిత్యం వివాదాల్లో ఉన్నా పిచ్చ మాస్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అది స్వ‌త‌హాగా వ‌చ్చిన నైజం. ఆ మాస్ నుంచి చింత‌మ‌నేనిని ఎవ్వ‌రూ వేరు చేసి చూడ‌లేం. దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి పేద వ‌ర్గాలు ఎవ‌రైనా ఏ ఇబ్బంది వ‌చ్చింద‌ని తెలిసినా చింత‌మ‌నేని వెంట‌నే వాలిపోతారు.


వారి బాధ‌ల్లో, వారి క‌ష్టాల్లో పాలు పంచుకుంటారు. పైగా చింత‌మ‌నేని ఎంపీటీసీ నుంచి ఎంపీపీ అయ్యి ఆ త‌ర్వాత ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి ప్ర‌భుత్వ విప్ అయ్యారు. అందుకే ఆయ‌న‌కు గ్రౌండ్ లెవ‌ల్లో పేదోడి క‌ష్టం ఎలా ?  ఉంటుందో తెలుసు. కేవ‌లం దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు.. వెస్ట్ గోదావ‌రి, ఇటు కృష్ణా జిల్లాల్లో జ‌రిగే పార్టీ స‌భ‌లు, స‌మావేశాల‌కు కూడా ఆయ‌న్ను ఆహ్వానిస్తూ ఉంటారు టీడీపీ నేత‌లు.. ఉదాహ‌ర‌ణ‌కు గ‌న్న‌వ‌రంలో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు మాట్లాడితే స‌భ అదిరిపోతుంది.. ఆయ‌న త‌ర్వాత చింత‌మ‌నేని మైక్ పుచ్చుకుంటే అంత‌కు మించి అరుపులు, ఈల‌లు, కేక‌ల‌తో ద‌ద్ద‌రిల్లాల్సిందే.


చింత‌మ‌నేని కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గంతో ప‌ని లేదు.. రాష్ట్రంలో ఎక్క‌డ‌కు వెళ్లినా చెక్కు చెద‌ర‌ని అభిమానులు ఉన్నారు. అంత‌లా అభిమానుల‌తో క‌లిసిపోతారు చింత‌మ‌నేని.. అయితే దూకుడుగా ముందుకు వెళ‌తార‌న్న విష‌యం ఒక్క‌టే చింత‌మ‌నేనికి మైన‌స్ గా మారుతోంది. మాస్ పీపుల్ తో కనెక్ట్ అయ్యే వాళ్ల‌లో చాలా మందికి ఈ ల‌క్ష‌ణం స్వ‌భావికంగా ఉంటుంది. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేస్తే చింత‌మ‌నేని మాస్ కు తిరుగులేని మొన‌గాడ నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: