మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను ఎక్కువగా బెంజ్ మంత్రి అని పిలుస్తూ ఉంటారు టిడిపి నేతలు. ఇప్పుడు మళ్లీ అలాంటి మంత్రిని మరొకసారి గెలిపించడానికి చాలా కృషిపడుతున్నారు. ఒకప్పుడు టిడిపికి జయరాం ఏం చేశారో నేతలు అసలు మర్చిపోయినట్టుగా ఉన్నారు. వీటితో పాటు టీడీపీ నేతలు విమర్శలు కూడా జయరాం మర్చిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు గుంతకల్లు టిడిపి ఎమ్మెల్యేగా మరొకసారి పోటీ చేస్తున్నారు. దీంతో ఈసారి ఈయన అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి జయరాం కు వైసిపి అధినేత జగన్ కు దండం పెట్టి మరి తన కుట్రలో బలి కావడానికి సిద్ధంగా లేనంటూ తెగేసి చెప్పారు. దీంతో అందరూ కాంగ్రెస్ లోకి జయరాం వెళ్తారనుకున్నారు.కానీ కర్ణాటకలో మంత్రిగా ఉన్న తన సోదరుడు నాగేంద్ర సహాయంతోనే టీడీపీలోకి చేరినట్టుగా తెలుస్తోంది. అలా గుంతకల్లు టికెట్టు జయరాంకు కేటాయించారు. అయితే వాస్తవానికి గుంతకల్లు నియోజకవర్గం కు తెలుగుదేశం పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అవేమీ లెక్కచేయకుండా జయరాం ఎన్నికల నాటికి అందరిని ఏకం చేసి నియోజకవర్గంలో తిరిగేలా చేస్తున్నారు.


ముఖ్యంగా ఆయన సోదరుడి కుమారుడు నారాయణస్వామి, ఈశ్వర్ ఇద్దరు కూడా రంగంలోకి దిగారు. మండలాల వారీగా వ్యతిరేకంగా ఉన్న నాయకులను కలిసి పార్టీకి పనిచేయాలని సూచిస్తున్నారు. అలా గుంతకల్లులో తెలుగుదేశం పార్టీ క్యాడర్ను ఏకతాటిగా తెచ్చి గెలుపు దిశగా అడుగులు వేయిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ టికెట్ రాని మాజీ మంత్రి జితేంద్ర గౌడ్ చాలా అసంతృప్తితో ఉన్నారట. అనంతపురం అర్బన్ లో సీటు రాని మరొక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా జితేంద్ర గౌడ్ ను పిలిపించి మరి పార్టీ కోసం పని చేయాలంటూ సూచించారట. పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు జితేంద్ర గౌడ్ కి పార్టీలో తగినంత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారట. అలా జితేంద్ర గౌడ్ కూడా ఇప్పుడు జయరాంకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.


2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి పిఆర్పి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత వైసీపీ పార్టీలో 2014 ,19 ఎన్నికలలో గెలిచారు. అలా మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా పనిచేసినటువంటి జయరాం ఇప్పుడు గుంతకల్లులో ఈజీగా గెలుస్తారని టాక్ వినిపిస్తోంది. ఈయన వల్లే మరో రెండు నియోజకవర్గాలకు కూడా అక్కడ ప్లస్ అవుతోందని పలువురు నేతలు తెలియజేస్తున్నారు. జయరామ్ మొదట టిడిపిలో మొదట జడ్పిటిసిగా తన రాజకీయాన్ని ప్రారంభించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: