ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు మరొక ఇరవై రోజుల్లో జరగనున్నాయి. దాంట్లో భాగంగానే వైసిపి అభ్యర్థులు అలాగే కూటమి బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించేశారు. గత ఎన్నికలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అయినటువంటి చీరాలలో వైసిపికి  గాలి వీచింది. ఈసారి అక్కడ ఎలాగైనా సరే గెలవాలని పట్టుదలతో వైసిపి ఉంది. అయినా కూడా అక్కడ వీలుకాని పరిస్థితి కనబడుతుంది. గత ఎన్నికలలో అక్కడనుండి  టిడిపి నుంచి కరణంబలరాం గారు గెలిచారు. కాకపోతే వైసిపి అధికారంలో ఉండటం వల్ల ఆయన వైసీపీలో చేరడం జరిగింది. అప్పటినుండి ఆయన వైసీపీకి ఇన్చార్జిగా పనిచేయడం మొదలుపెట్టారు.ప్రస్తుతం టిడిపి నుంచి కొండయ్య గారు ఇన్చార్జిగా ఉండటం వల్ల ఆయనకే అధిష్టానం టికెట్ ని కేటాయించింది. అయితే కొండయ్య గారు అక్కడ బలహీనంగా ఉన్న సంగతి టిడిపికి ముందే తెలుసు కాకపోతే అక్కడ ఆమంచి కృష్ణ మోహన్ గారు కరణం బలరాం గారి మధ్య ఉన్నటువంటి ఆ విభేదాల కారణంగా కచ్చితంగా టిడిపి పై చేయి సాధిస్తుంది అని అధిష్టానం లెక్కలు వేస్తుంది. 2009 లో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరపున అలాగే 2014 లో ఇండిపెండెంట్గా నిలిచి గెలిచారు. అయితే 2019 లో మాత్రం టిడిపి అభ్యర్థి కరణం బలరాం మీద ఓటమి చవి చూశారు. వైసిపి అధిష్టానం గత రెండు సంవత్సరాలుగా పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చింది  కానీ బాధ్యతలు స్వీకరించడానికి ఆమంచి ఇష్టం లేదు. ఒకవైపు ఆమంచికి కృష్టమోహన్ గారికి టికెట్ రాలేదన్న నిరాశతో ఆయన కాంగ్రెస్లో కలిశారు. ఐతే దాని ఎఫెక్ట్ కచ్చితంగా వైసీపీ మీద పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే కనక జరిగితే ఓట్ల చీలిక అనేది కచ్చితంగా జరుగుతుంది దానివల్ల అది వైసీపీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందని ఆమంచి వర్గీయలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: