మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఒకప్పుడు మంచి రాజకీయ వేత్తగా ఎదిగారు.  ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు.  తర్వాత పూర్తిగా రాజకీయాలకు విరామం ఇచ్చి సినిమాల వైపు ఆయన వెళ్తున్నారు.  అలాంటి చిరంజీవి ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఒక సామాన్య హీరోగా తనది తాను చూసుకుంటూ ఉన్నారు.  ఈ క్రమంలోనే  తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించి ఈసారి ఎలాగైనా మంచి సీట్లు సాధించి టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వైసిపి పై  తిరుగుబాటు బాగుటా ఎగరవేస్తున్నారని చెప్పవచ్చు. ఇదే తరుణంలో క్రియాశీలకంగా ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయకుండా చిరంజీవి ఉంటూ వస్తున్నారు. 

అంతేకాకుండా ఆ మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కూడా సన్నిహితంగా మెలిగారు. వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మూడు రాజధానులకు కూడా ఆయన మద్దతు పలికారు. ఆ టైంలో ప్రజల్లో చిరు వేరు  పవన్ కళ్యాణ్ వేరు అనే భావన కూడా కలిగింది. ఇదే తరుణంలో ప్రస్తుతం ఎన్నికల పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే చిరు జనసేనకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపు కూడా ఇస్తున్నారు. దీంతో చిరంజీవిపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా ప్రముఖ నేతలు చిరును టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి  అయినటువంటి గ్రంధి శ్రీనివాస్  చిరు మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. 

చిరు పక్కా కమర్షియల్ అని, తన సినిమా ఫీల్డ్ లో మనుగడ కోసమే పవన్ కి అనుకూలంగా ఉంటున్నారని తెలియజేశాడు. చిరు సినిమా టికెట్ రేట్ ల వ్యవహారం మీద సీఎంతో మాట్లాడినప్పుడు ఆయన నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయలేదని పెద్ద రాద్ధాంతం చేశారని,  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిరు సినిమాలు చూడొద్దని అభిమానులకు పిలుపునిచ్చాడని దీంతో చిరు తర్వాత సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే చిరంజీవి పక్కా కమర్షియల్ అని తెలుస్తోందని. పవన్ అభిమానులు ఉంటేనే చిరు సినిమాలు  ఆడతాయని, పవన్ పై ప్రేమతో ఆయన ఇలా చేయట్లేదని తాను సంపాదించుకోవడం కోసమే ఈ విధంగా పవన్ తో కలిశారని,  జనసేనకు అయిదు కోట్ల ఫండ్ ఇచ్చారని,తన కొత్త చిత్రం విశ్వంభర త్వరలో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ విధంగా చిరంజీవి ప్లానింగ్ చేసి పవన్ ను ప్రసన్నం చేసుకుంటున్నారని ఆరోపించారు.ప్రస్తుతం గ్రంధి శ్రీనివాస్ ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో ఇవి వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: