•కూటమిలో గొడవలు.. తెలివిగా వాడుకోలేకపోతున్న కేతిరెడ్డి

•ఆ సామాజిక వర్గమే సతీష్ కుమార్ కి బలం

•నువ్వా.. నేనా.. సమరంలో గెలిచేది ఎవరు..




(అమరావతి.. ఇండియా హెరాల్డ్)
మరికొన్ని రోజుల్లో సమరం మొదలుకానుంది.. నువ్వా.. నేనా అంటూ ఇప్పటికే అధికార పార్టీ.. ప్రత్యర్థి పార్టీలు పోటీపడుతున్నాయి.. నువ్వా.. నేనా గెలిచేది ఎవరు అంటూ కామెంట్లు చేసుకుంటూ ఉండడంతో సర్వత్ర ఉత్కంఠ భరితంగా మారింది ..ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా వాడి వేడిగా జరుగుతూ ఉండడం గమనార్హం.. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి టీడీపీ పార్టీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు.  అందులో భాగంగానే సింగిల్ గా పోటీ చేసే సత్తా లేక అటు జనసేన ఇటు బిజెపిలను పొత్తులో కలుపుకొని ముందు సాగుతున్నారు .. మరొకవైపు సింహం సింగిల్ గా వస్తుంది అంటూ జగన్ ఒంటరిగా పోరాటం చేస్తూ తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను మళ్ళీ గెలిపిస్తాయనే  నమ్మకంతో ముందుకు వెళుతున్నారు.. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాలలో అటు టిడిపి ఇటు వైఎస్ఆర్సిపి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది ..


ముఖ్యంగా ధర్మవరం విషయానికి వస్తే.. 1952లో ధర్మవరం నియోజకవర్గం ఏర్పడింది.. ఇప్పటివరకు 15 సార్లు జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం ఏడుసార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు ,కిసాన్ మజ్దూర్  ప్రజా పార్టీ స్వతంత్ర పార్టీ,  వైసిపి ఒక్కొక్కసారి అధికారం లోకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నుంచి గరుడమ్మ గారి నాగిరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. గతంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వైసిపిలోకి చేరి 2019లో కూడా ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 2024లో కూడా వైసీపీ తరఫున బరిలోకి దిగారు.. ఇప్పుడు ఈయనకు ప్రత్యర్థిగా కూటమి నేత బిజెపి సత్య కుమార్ యాదవ్ బరిలోకి దిగారు.  మొత్తం నియోజకవర్గంలో 2,39,557 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా టిడిపి ధర్మవరం ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ పనిచేస్తున్నారు..


 ఇక 2019 ఎన్నికల్లో కేతిరెడ్డికి పోటీగా గోనుగుంట్ల సూర్యనారాయణ టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు.. దీంతో భంగపడిన ఆయన బిజెపిలోకి చేరిపోయారు. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ బిజెపికి రావడంతో అందరూ గోనుగుంట్లకి టికెట్ వస్తుందని అంచనా వేశారు.. కానీ అనుహ్యంగా ఆ టికెట్ బిజెపి నేత సత్యకుమార్ కు వెళ్ళిపోయింది. దీంతో పరిటాల శ్రీరామ్ కి టికెట్ ఇవ్వాలని అక్కడ నేతలు డిమాండ్ కూడా చేశారు.. కానీ చంద్రబాబు పొత్తులో భాగంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేకపోవడమే అక్కడి నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

మరోవైపు వైసీపీ నేతలు కూటమిలో చేరుతూ వైసిపికి దెబ్బ వేస్తున్నారు.. బీసీ నాయకుడు ముదిగుబ్బ ఎంపీపీ అభ్యర్థికి ఆది నారాయణ యాదవ్ వైసీపీ కి రాజీనామా చేసి కార్యకర్తలతో కలిసి కూటమిలో చేరారు. మరోవైపు గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రచారానికి రావడం లేదు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అంటుండగా ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి జగన్ సీటు ఇవ్వగా.. దీంతో ఆయన నియోజకవర్గంలో ఉత్సాహంగా తిరుగుతున్నారు. అయితే ఆయన అనే మాటలు కొంతమందిలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాను.. అన్నం తినే ఎవరైనా సరే వైసీపీ వైపు మొగ్గు చూపాలని అనడం స్థానిక ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒత్తిడిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరొకవైపు కూటమిలో భాగంగా గొడవలు జరుగుతున్నప్పటికీ అవేవీ ఈయన ఉపయోగించుకోవడం లేదు. మరొకవైపు ధర్మవరంలో బీసీలు అధికంగా ఉండడం కారణంగా సామాజిక వర్గంగా కేతిరెడ్డి వెనుకబడి ఉన్నారని సమాచారం.. ప్రత్యర్థి అభ్యర్థి బీసీ నేత కావడంతో కేతిరెడ్డికి ఎదురీత తప్పేలా లేదు. ఈ క్రమంలో కేతిరెడ్డి కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ద్వారానే ముందుకు వెళుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.. మరి ఇంతటి సందిగ్ధత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు అటు సతీష్ కుమార్ ఇటు కేతిరెడ్డి.. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: