- ష‌ర్మిల‌కు కాంగ్రెస్ కంటే బీజేపీ అయితే బెట‌రా ?
- వివేకా కేసు రాజ‌కీయం చేసినా ఎన్డీయే గెలిస్తే ఆశ‌ల‌పై నీళ్లే..?
- అడ‌క‌త్తెర‌లో పోక చెక్క‌లా ష‌ర్మిల రాజ‌కీయ జీవితం


( రాయ‌ల‌సీయ - ఇండియా హెరాల్డ్ )
క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా ఉన్న ఆ పార్టీ ఏపీ చీఫ్‌, సీఎం జ‌గ‌న్ సోద‌రి.. భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌ను ఓడించాల‌ని నేరుగానే పిలుపునిస్తున్నారు. త‌న‌ను గెలిపించాల‌ని కొంగు ప‌ట్టుకుని బ్ర‌తిమాలుతున్నారు. దీనికి కార‌ణం.. త‌మ కుటుంబానికి అన్యాయం జ‌రిగింద‌ని, దారుణ హ‌త్య‌కు గురైన బాబాయి వివేకా కేసులో త‌మ‌కు న్యాయం కోస‌మే రోడ్డెక్కామ‌ని ఆమె చెబుతున్నారు. దీంతో నిజంగానే ఆమె ఎంపీ అయితే.. వివేకా కేసులో న్యాయం జ‌రుగుతుందా? అనేది ప్ర‌శ్న‌.


ఈ విష‌యాన్ని కొంత‌లోతుగా ప‌రిశీలిస్తే.. ఆమె ఆశిస్తున్న‌ట్టుగా.. తాను ఎంపీ అయితే.. న్యాయం జ‌రుగు తుందనేది కేవ‌లం మాట మాత్ర‌మే. ఇదే నిజ‌మైతే.. దేశంలో అనేక మంది ఎంపీలు.. ఇత‌ర పార్టీల్లో ద‌శాబ్దాల కాలం ఉండి.. గెలిచిన త‌ర్వాత కూడా.. బీజేపీ  బాట ప‌ట్టారు. మ‌హారాష్ట్ర‌కు చెందిన అశోక్ చ‌వాన్‌.. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఈయ‌న మూడు ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్నారు. పార్టీని డెవ‌ల‌ప్ చేశారు. కానీ, ఈయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి.


కాంగ్రెస్ పార్టీలో ఉండి.. త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని లెక్క‌లు వేసుకున్న ఆయ‌న క‌న్నీరు పెట్టుకుని మ‌రీ బీజేపీ బాట‌పట్టారు. ఇక‌, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎంగా ఉన్న కాంగ్రెస్ నాయ‌కుడు, బ‌ల‌మైన నేత‌.. షార్ప్ షూట‌ర్ డీకే శివ‌కుమార్ త‌ల‌పై ఇప్ప‌టికీ ఈడీ క‌త్తి వేలాడుతూనే ఉంది. మ‌రి కాంగ్రెస్‌లో ఉన్నారు.. పైగా ప్ర‌జ‌ల నుంచి గెలిచారు.. ఆయ‌నేమ‌న్నా.. కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డ్డారా ?  అంటే.. లేద‌నే చెప్పాలి. ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు చాలానే ఉన్నాయి. అంటే. కేవ‌లం ఎంపీ అయితేనే.. వివేకా కేసులో న్యాయం జ‌రిగిపోతుంద‌ని చెప్ప‌డానికి ఎలాంటి ఆధారాలు లేవు.


ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా.. బీజేపీలోచేరి.. అక్క‌డ నుంచి ఎంపీగా గెలిస్తే.. ఎంతో కొంత ఉప‌శ‌మ‌నం పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారికి బెయిల్ రాకుండా అడ్డుకునే అవ‌కాశం ఉండేది. అలా కాకుండా.. వివేకా కేసును రాజ‌కీయం చేసిన ద‌రిమిలా.. రేపు మ‌రోసారి బీజేపీనే కేంద్రంలో వ‌స్తే.. ష‌ర్మిల ఆశిస్తున్న న్యాయం మ‌రో ఐదేళ్లు  గ‌డిచినా.. జ‌రిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. సో.. ఇప్పుడు ఆమె చేస్తున్న ప్ర‌య‌త్నం కేవ‌లం సీఎం జ‌గ‌న్‌ను అధికారం నుంచి దించేయ‌డ‌మే. మ‌రి ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: