కాకినాడ జిల్లా పిఠాపురంలో  రాజకీయాలు చాలా వేడెక్కాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసిపి వేస్తున్న కుయుక్తులు పారడం లేదు. కూటమి పార్టీల వ్యూహాల ముందు వైసీపీ వ్యూహాలు పాలిపోతున్నాయి. దీంతో వైసిపి భయపడి డబ్బులు ఇచ్చి మరీ సర్పంచ్,ఎంపీటీసీలు, వార్డు మెంబర్లను కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో వైసిపి కీలక నేత వంగ గీతకు హ్యాండ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరి అలాంటి పిఠాపురంలో వార్ వన్ సైడ్ అయ్యేటట్టే ఉందా అనే వివరాలు చూద్దాం.. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి  ప్రచారంలో దూసుకుపోతోంది. ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను ఓడించాలని అనేక కుయుక్తులు పన్నుతోంది. 

టిడిపిలో ఏర్పడే వర్గ పోరే మాకు ప్లస్ అవుతుందని ఆమె భావిస్తూ వచ్చింది. ఆమె ఆలోచనలకు  టిడిపి బాస్ చంద్రబాబు చెక్ పెట్టారు.  ఎలాంటి వర్గ పోరు ఏర్పడకుండా కలిసికట్టుగా ప్రచారం చేసుకునేలా  వ్యూహాలు రచించాడు. ఇదే తరుణంలో వంగ గీతా కూడా ముగ్గురు కీలక నేతలకు పిఠాపురం బాధ్యతలను అప్పగించి అధికారుల వరకు కూడా తనకే సపోర్ట్ చేసేలా అన్ని రకాల వ్యూహాలు రచించుకొని పెట్టుకుంది. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా కూటమి పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే టిడిపి కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ కు టికెట్ ఖరారు అయింది. టికెట్ కోసం ఆశించిన వర్మ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇదే ఆసరాగా చేసుకున్న వంగ గీత వారి మధ్య ఆధిపత్యం ఏర్పడుతుందని,దీనివల్ల ఓట్ల చీలిక జరగడం వల్ల నాకు ప్లస్ జరుగుతుందని భావించింది.

ఇది గమనించిన టిడిపి బాస్ చంద్రబాబు ఆయనను పిలిచి ఎమ్మెల్సీ లేదంటే ఏదైనా కీలక పదవి నీకు ఇస్తానని  కలిసి ప్రచారం చేసుకోవాలని చెప్పారట.  ఆయన మాటను శిరసావహించిన వర్మ పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో వంగ గీతాకు మింగుడు పడడం లేదట. ఎలాగైనా పవన్ గెలుస్తాడనే ఆలోచన ఆమెకు రావడంతో విపరీతంగా డబ్బులు కూడా పంచే కార్యక్రమం మొదలుపెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, వర్మ,నాగబాబు ఈ ముగ్గురు నేతలు  నియోజకవర్గంలో అలుపెరగకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ 14 సూత్రాలతో పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా చేస్తారో  ముందుగానే కొన్ని ప్రింటింగ్ కాపీలు కొట్టించి ప్రజలకు పంచుతున్నారట. దీంతో వైసిపి క్యాడర్లో ఇప్పటికే కాస్త అసమ్మతి ఏర్పడినట్టు తెలుస్తోంది.  ఈ విధంగా వంగ గీతా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ జనసేన కూటమి దూసుకుపోతుందని అక్కడ పవన్ గెలుపు ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: