ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రత్తిపాడు అనే నియోజకవర్గంలో స్వర్ణ భారతి నగర్ లో ఎంతో మంది చిన్న పిల్లలని గంజాయికి బానిసలను చేస్తున్నారు అని వెనకాల వైసీపీ హస్తం ఉంది అని దాని కోసం నిరసన వ్యక్తం చేస్తూ కోడూరు లక్ష్మీ అనే మహిళ ఢిల్లీ వెళ్లి అక్కడ వేలు నరుకుంది. దీనితో టీడీపీ నాయకుడు లోకేష్ సంత బాబాయ్ గుండెలు చీర్చి అధికారంలోకి వచ్చిన వ్యక్తి మీరు వేలు నరుక్కున్నంత మాత్రాన దిగి వస్తాడా..? నిరసన తెలపడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి.

ఇది సరైన పద్ధతి కాదు? అసుర పాలన అంతానికి సమయం వచ్చింది అంటూ స్పందించాడు. ఇలా చాలామంది టీడీపీ నాయకులు దీనిపై గట్టిగా స్పందించారు. ఇక ఈమెకు టీడీపీ పార్టీ నేతల నుండి కట్టి సపోర్ట్ వచ్చింది. కాకపోతే కథ మళ్ళీ అడ్డం తిరిగింది. ఈమె ఢిల్లీ నుంచి రావడం రావడమే తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లడంతో దానిని వైసీపీ పార్టీ వారు హైలెట్ చేస్తున్నారు.  

ఇకపోతే తాజాగా ఈ ఘటనపై సాక్షి తాజాగా ఓ కథనం రాసుకొచ్చింది దాని ప్రకారం... స్వర్ణ భారతి నగర్ కు చెందిన నమాల కృష్ణమూర్తి భార్య తులసమ్మ ఇద్దరు 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్లను వేసి ఫోర్జరీ పత్రాలను సృష్టించి వాటిని అమాయక ప్రజలకు అంటగట్టి ఆ కాలనీకి ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా పెట్టి కృష్ణ తులసి నగర్ అని పేరు పెట్టారు. 25 సంవత్సరాల క్రితం నామాల కృష్ణమూర్తి కూడా ఇలాగే చేతుల కోసుకొని, కళ్ళు పడుచుకొని అధికారులను బెదిరించి పనులు చేయించుకునే వాడు అని అక్కడి కాలనీవాసులే చెబుతున్నారు.

వాళ్ళ కుమార్తె కొవ్వూరు లక్ష్మి వాళ్ళ మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకొని స్వర్ణ భారతి నగర్, కృష్ణ తులసి నగర్, అడవి తక్కెళ్ళపాడు, తుఫాన్ నగర్ లో ఇదే విధంగా బ్లాక్ మెయిల్ స్థలాల కబ్జాకి పాల్పడుతూ ఉండేది. అలాగే ఫోర్జరీ పాత్రాలను సృష్టించి వేరొకరి స్థలాలను అమ్మేస్తూ ఉండేది అని స్థానికులు చెబుతున్నారు. ఆమె మీద పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈమె మీద నమోదు అయిన కేసులు అన్నీ కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ హయాంలో జరిగినవే.

2013 లో స్వర్ణ భారతి నగర్ కి చెందిన దివ్య భారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీఫామ్ ను సృష్టించి విషయమై ఈమెపై కేసు కూడా అయ్యింది. ఆ తర్వాత ఈమె అనేక ఫోర్జరీ పనులు చేయడంతో అనేక కేసులు ఈమపై నమోదు అయ్యాయి. వాటిని తీసేస్తాం అని టీడీపీ ఆమెకు హామీ ఇవ్వడంతోనే ఈమె ఢిల్లీకి వెళ్లి వేలు నరుకుంది అని సాక్షి వారు కథనాన్ని విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: