ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావుకు సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింటా బాగా వైరల్ గా మారింది.చంద్రబాబు నాయుడు వల్ల ఆయన సొంత కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారు పూర్తిగా దూరం చేయబడ్డారనే కామెంట్లు ఇప్పటికీ బాగా వినిపిస్తున్న నేపథ్యంలో... జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ గతంలో ఇదే విషయాలపై కామెంట్స్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో... చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొదటినుంచీ నమ్మదగిన వ్యక్తి కాదని.. సొంత తమ్ముడినే మోసం చేశాడని నార్నె శ్రీనివాస్ కామెంట్స్ చేశారు.


తన సొంత తమ్ముడికే టిక్కెట్ ఇవ్వలేదని చెప్పిన నార్నె శ్రీనివాసరావు... ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. చంద్రబాబు నాయుడు తమ్ముడిని గొలుసులు, తాళ్లతో కట్టేస్తున్నారని ఆనాడు సంచలన కామెంట్స్ చేశారు. ఇక అదే సమయంలో.. చంద్రబాబుకు ధమ్మూ, ధైర్యం ఉంటే తన తమ్ముడిని తీసుకొచ్చి ప్రజల ముందు ప్రవేశపెట్టాలని, ఈ విషయం తాను ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాస్ ఆ వీడియోలో స్పష్టం చేశారు.ఇంకా ఇదే క్రమంలో... చంద్రబాబు నాయుడు కోవర్టులను తయారు చేసి, పక్కపార్టీల్లోకి పంపించి, వాళ్లతో జిమ్మిక్కులు చేస్తున్నారని.. అదేవిధంగా... ప్రజల్లో ఎలాంటి ఇదీ లేనప్పటికీ గారడీలు చేస్తూ, మోసాలు చేస్తూనే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గట్టెక్కుతున్నాడని కోప్పడ్డారు నార్నె. ఇదే సమయంలో... సొంతబలం పై గెలిచే సత్తా ఏనాడూ చంద్రబాబుకు లేదని, గెలవలేరని సంచలన కామెంట్స్ చేశారు.


ఈ సందర్భంగా... తిరుపతిలో చంద్రబాబు నాయుడు సొంత చెల్లెల్లుకు యాక్సిడెంట్ జరిగితే.. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉండి, హైదరాబాద్ కు షిఫ్ట్ చేసి ట్రీట్ మెంట్ ఇప్పిస్తే.. చంద్రబాబు కానీ, ఆయన భార్య కానీ, కొడుకు నారా లోకేష్ కానీ పలకరించలేదని.. కనీసం ఫోన్ కూడా చేసి పలకరించడం, పరిస్థితి అడిగి తెలుసుకోవడం వంటివి చేయలేకపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని నాడు ఆ వీడియోలో నార్నె దుయ్యబట్టారు.ఈ క్రమంలోనే... సొంత చెల్లెలు అటువంటి పరిస్థితుల్లో ఉంటేనే చూడని చంద్రబాబు... రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారనేది ప్రజలే తేల్చుకోవాలని నార్నె శ్రీనివాస్  స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియోని వైసీపీ శ్రేణులు తమ ప్రమోషన్స్ కి వాడుకుంటున్నారు. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: