ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకీ హీటెక్కిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం చేస్తూనే ఉన్నాయి. రేపటితో నామినేషన్ల హడావిడి కూడా పూర్తి కాబోతోంది. మరొకవైపు హీరో విశాల్ లాంటివాళ్ళు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సపోర్టు చేస్తూ ఖచ్చితంగా ఈసారి ఎన్నికలలో ఆయన గెలుస్తారని కూడా తెలియజేస్తున్నారు. తాజాగా ఇప్పుడు కే జి ఎఫ్ సినిమా తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు రామచంద్రరాజు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు.


వైసీపీ పార్టీకి తన మద్దతు అన్నట్లుగా తెలియజేశారు నటుడు రామచంద్రరాజు.. కన్నడ హీరో యష్ దగ్గర పనిచేసిన రామచంద్రరాజు కేజిఎఫ్ సినిమాలో గరుడ అనే విలన్ పాత్రలు అద్భుతంగా నటించారు. ఆ తర్వాత తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో కూడా నటించారు. ఈ నటుడు తాజాగా ఈయన ఆంధ్రప్రదేశ్ లో రైల్వే కోడూరు నియోజకవర్గం లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోరుకుంట్ల శ్రీనివాస్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా అక్కడ దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ వైసిపి ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ అన్నలాంటివారు అంటూ చెప్పుకొచ్చారు.


అలాగే వైసిపి పార్టీ పైన తన మనసులో ఉన్న మాటను కూడా తెలియజేశారు. నామినేషన్ వేయడానికి ఇంత మంది జనాలు వస్తారని ఎప్పుడు కూడా అనుకోలేదని దాదాపుగా 20 వేల 30 వేల మెజారిటీతో నా స్నేహితుడు ఈ ఎన్నికలలో గెలుస్తారని చాలా నమ్మకంతో ఉన్నానని తెలిపారు. జగన్ పాలన చూస్తే తనకు చాలా ముచ్చటేస్తుందని వైసీపీకే తన మద్దతు అన్నట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలలో చాలా అభివృద్ధి కనిపిస్తోంది.. ప్రజలకు సేవ చేయడంలో ఎలాంటి నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు జగన్ ..ఈ విషయానికి తాను హ్యాట్సాఫ్ చెబుతున్నానంటూ నటుడు రాము చంద్ర రాజు తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: