ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలోని చాలా కీలకంగా మారారు వాలంటరీలు.. ముఖ్యంగా జగన్ తీసుకువచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థను గతంలో ఎన్నో ప్రభుత్వాలు విమర్శించిన మరికొన్ని ప్రభుత్వాలు సమర్ధించాయి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి వారు వాలంటీర్లపైన క్రిమినల్స్, కిడ్నాపర్స్ అంటూ కూడా ముద్రవేశారు. కానీ ఎలక్షన్ సమయం వచ్చేసరికి వాలంటరీలు దేవుళ్ళు అంటూ.. వారికి ఇచ్చే జీవితం సరిపోదు 10000 చేస్తామంటు తెలుపుతున్నారు. దీంతో కొంతమంది రాజీనామా చేసి టిడిపి వైపు పోయారని మరి కొంతమంది తమకు అవకాశం ఇచ్చినటువంటి వైసీపీ పార్టీకి పనిచేయడానికి రాజీనామా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఇప్పటివరకు వాలంటరీల రాజీనామా పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగినటువంటి విచారణ చేయగా.. తాజాగా ఇటీవలే వాలంటరీల మీద విచారణ కూడా పూర్తి అయ్యిందట. కోర్టు ఎన్నికల సంఘాన్ని ఎంతమంది రాజీనామా చేశారని అడగగా.. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా 62, 571మంది వాలంటరీలు రాజీనామా చేసినట్లుగా తేలింది.. హైకోర్టుకు నివేదించింది ఎన్నికల కమిషన్.. అయితే ec మాత్రం వాలంటరీల రాజీనామా మీద జోక్యం చేసుకోలేమంటూ కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది.


ఎందుకంటే... వారి యొక్క రాజీనామాలు ఆమోదించవద్దు.. వారు అలాగే ఉండాలి. వారి రాజీనామాలు ఆమోదించేస్తే.. వారు సాధారణ పౌరులవుతారు అప్పుడు వాళ్లు వచ్చి ఎన్నికలు ఏజెంట్గా కూడా పనిచేస్తారని.. ఎన్నికల ఏజెంట్గా పనిచేస్తే ఎన్నికల పైన ప్రభావం చూపిస్తారని.. అట్లాంటి హక్కు లేదని ఎన్నికల సంఘం వాదించింది.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాదించింది. ఈ నేపథ్యంలోని రాతపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి ec కి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణ 2 వారాలపాటు వాయిదా వేశారు. వచ్చే నెల నాలుగో తేదీ ఎన్నికలకు ముందు ఈ విషయం తేలబోతోంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు కూడా చాలా రసవత్తంగానే మారుతున్నాయి. మరి వాలంటరీ వ్యవస్థ తీరు ఏ పార్టీ పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: