ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల ప్రచారం కోసం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పర్యటించినప్పుడు సీఎం జగన్ సీనియర్ నేత అలాగే మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గురించి ఆసక్తికరమైన మాటలు మాట్లాడుతూ బొత్సను నేను అన్నా అంటానని ఆయన నాకు తండ్రి లాంటి వారిని అందరూ కలిసి బొత్స అన్నాను గెలిపించాలని  అన్నారు. అయితే జగన్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలకు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న షర్మిల జగనన్నను  తీవ్రంగా విమర్శించారు.

దాంట్లో భాగంగా గతంలో బొత్స సత్యనారాయణ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని తాగుబోతు అన్నారని తల్లి విజయమ్మను కూడా అవమానించాడు. ఇలాంటి బొత్స తనకు తండ్రి తో ఎలా సమానం అవుతారని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడిన వారినేమో మంత్రి పదవులు ఇచ్చి పక్కన పెట్టుకున్నారని ఆయన్ను తన తండ్రితో సమానంగా పోల్చడం అనేది ఎంతవరకు సబబొ చెప్పాలని సీఎం జగన్ పై షర్మిల తీవ్రంగా విరుచుకుబడ్డారు. అలాంటి వ్యక్తిపై నీకు అంత ప్రేమగా ఉంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోలు తీసేసి బొత్స ఫోటోలు పెట్టుకోమని  కౌంటర్ ఇచ్చారు.

వంగా గీతను సీఎం జగన్ తన తల్లితో పోల్చడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గతంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వంగా గీత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించిన సంగతి మర్చిపోయారా జగనన్న అని గుర్తు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి దంపతులను అవమానించినవారిని పక్కన చేర్చుకోవడంలోనే జగన్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తుందని తీవ్రంగా విమర్శించారు.ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ కారన్నారు. ఆయన కోసం పని చేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్ళు ఏమి కారన్నారు. అసలు వైఎస్సార్సీపీ పార్టీలో వైఎస్సార్ లేడని షర్మిల ఆరోపించారు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి , ఆర్ అంటే రామకృష్ణా రెడ్డి అన్నారు.జగనన్న చేసిన అరాచకమైన పాలనను ప్రజలు గమనించారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా జగనన్న ఇంటికి ఎపుడు పంపుదామంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: