వైసీపీ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రధానంగా విద్యపై జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారనేది తెలిసిన విషయమే. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను జగన్ పూర్తిగా రూపు మార్చేశారు.ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ని ప్రవేశ పెట్టారు. గతంలో ఎన్నడూ చూడని మార్పులు జగన్ మోహన్ రెడ్డి చేపట్టారు. ఇక ఇదే విషయాన్ని ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు బల్లగుద్ది చెబుతున్న విషయం తెరపైకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా... తాము చేసిన అభివృద్ధి గురించి ఆయా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చెప్పుకోవడం అందరికి తెలిసిందే. అందులో వాస్తవాస్తవాలు ఎంతనేది ప్రజలకు తెలుసు. అయితే... ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులతో స్వయంగా ప్రజలే ఎదురెళ్లి... ఈ ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన మేలులను ఇంకా విద్యార్థుల జీవితాల్లో కలిగిన మార్పులను వివరించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ అరుదైన ఘటన తాజాగా ఉత్తరాంధ్రలో జరిగింది. ఉత్తర ఆంధ్రలో వైసీపీకి ప్రజాదరణ పెరుగుతుంది. 


ముఖ్యంగా ఈ ప్రాంతంలో జగనన్న విద్యా పథకాలు అద్భుత ఫలితాలిస్తున్నాయని అంటున్నారు. ఫలితంగా... చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలో... జగనన్న "విద్యా దీవెన" పేరుతో ఫీజు రీయంబర్స్ మెంట్, జగనన్న "వసతి దీవెన", జగనన్న "గోరు ముద్ద", జగనన్న "అమ్మ ఒడి", జగనన్న "విద్యా కానుక", "నాడు - నేడు" పేరుతో బడుల రూపు రేఖలే మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. ఒక్కమాటలో చెప్పాలంటే... విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు వైసీపీ ప్రభుత్వం నిజంగా శ్రీకారం చుట్టిందనే చెప్పాలి.అందుకే విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైసీపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ ఎక్కడికి వెళ్లినా కానీ జగనన్న విద్యా పథకాలే ప్రస్తావిస్తున్నారు. ఇంకా అంతేకాదు ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాల గురించి పేరుపేరునా అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్పందిస్తున్న విద్యార్థుల తల్లితండ్రులు... జగనన్న దయ వల్ల తమ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారని ఎంతో ఆనందంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: