ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు చాల కీలక పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు కూడా ఈసారి అటు వైసిపి, టిడిపి పార్టీకి కీలకంగా మారనున్నాయి.. వైసీపీకి పట్టు ఉన్నటువంటి కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో మంత్రి దాడిశెట్టి రాజాకు, యనమల రామకృష్ణ కుటుంబానికి మధ్య ఎప్పటినుంచో ఒక యుద్ధం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే గత రెండు ఎన్నికలలో యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు ఓడిపోతూనే ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ యనమల కుటుంబంలో విభేదాలు తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి.


దీంతో టిడిపి మాజీ మంత్రి సీనియర్ నేత యనమల కుటుంబం నుంచి ఈసారి కృష్ణుడికి బదులుగా ఆయన కుమార్తె దివ్యాను పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థి బరిలోకి దించారు. కానీ తునిలో మూడవసారి పోటీకి సిద్ధమైన కృష్ణుడు దీనిని చాలా వ్యతిరేకంగా తీసుకొని ఆమెకు సహకరించకుండా దూరంగా ఉంటున్నారట.. గత కొద్ది రోజుల నుంచి వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లిన యనమల కృష్ణుడు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తో టచ్ లోకి వెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో త్వరలోనే యనమల కృష్ణుడు వైసీపీ పార్టీలోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజున కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు కూడా సిద్ధమయ్యారని సమాచారం. అయితే తునిలో కథ దశాబ్దంగా రాజకీయాన్ని చూస్తే.. గతంలో వరుస విజయాలు సాధించిన యనమల రామకృష్ణుడు రాజకీయంగా పతనం కావడానికి ఆయన సోదరుడే కారణమని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అందుకే నేరుగా కృష్ణుడు పోటీ చేసిన యనమల కుటుంబానికి విజయం దక్కలేదట. ఈ నేపథ్యంలోనే టిడిపి తుని ఎమ్మెల్యే అభ్యర్థిగా రామకృష్ణుడు కుమార్తె దివ్యాను చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో కృష్ణుడు అలగడంతో ఎంత బుజ్జగించిన వెనక్కి తగ్గకపోవడంతో ఈయన వైసీపీ పార్టీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది. యనమల కృష్ణుడు చేరడంతో అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: