ఎన్నికలు వచ్చాయి అంటే చాలు  ఆయా పార్టీలు వారికి సంబంధించిన మేనిఫెస్టోలను  రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో కర్ణాటకలో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసి సక్సెస్ అయింది. తెలంగాణలో అదే స్టాటజీ మరోసారి సక్సెస్ అయింది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే తరుణంలో జగన్ మేనిఫెస్టో పై అందరికీ ఉత్కంఠ నెలకొని ఉంది. ఇందులో ఏ అంశాలు చేర్చారు అనేది చూద్దాం.

 ప్రస్తుతం చంద్రబాబు సూపర్ సిక్స్ అనే పేరుతో మేనిఫెస్టో ప్రకటించారు అంతేకాకుండా జనసేన చెప్పే ఇంకో నాలుగు అంశాలు కూడా చేర్చబోతున్నారట. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం 45 వేల కోట్ల రూపాయల పథకాలు నడిపిస్తూ వస్తున్నారు. ఇదే తరుణంలో జగన్  పాత పథకాలు తప్ప ఇంకా ఏ కొత్త పథకాలు కూడా తీసుకువచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు.   తాజాగా వైసిపి అనుకూల ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ లో ఒక వ్యక్తి అన్నా   రుణమాఫీ అను చాలు అంతా మన సైడే తిరుగుతుంది అన్నాడు. వెంటనే  ఆ వ్యక్తి మైకు ఆపించేసి  అవతలికి తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం జగన్ ప్రభుత్వం వస్తే రుణమాఫీ చేసే ఉద్దేశం కనిపించడం లేదు.

అయితే పెన్షన్ 4000 వికలాంగులకు, 6000 ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఇంతకుముందు మేనిఫెస్టోలో జగన్  పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం మేనిఫెస్టోలో జగన్ పెన్షన్ విషయం చంద్రబాబు కంటే కాస్త హైలెట్ గా చెబితేనే బాగుంటుంది తప్ప,  లేదంటే చంద్రబాబు పెన్షన్ స్కీమే హైలెట్ అవుతుంది. అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు కూడా డబ్బులు ఇస్తానని చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ జగన్ కూడా ఏడాదికి ఒకసారి ఇస్తున్నాడు కానీ చంద్రబాబు కిస్తీల వారిగా ఇస్తానని అంటున్నాడు. ఈ చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ కంటే జగన్ అడుగు ముందుకేసి ఇంకా మంచి పథకాలు తీసుకువస్తారా బడ్జెట్ సాధ్యం కాదని ఆగిపోతారా అనేది ఉత్కంఠ నెలకొని ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: