- న‌వ‌ర‌త్నాల్లో 31 ల‌క్ష‌ల మందికి ఇళ్లు ఇచ్చిన జ‌గ‌న్‌
- బాబు ఐదేళ్ల పాల‌న‌లో కేవ‌లం 75 వేలు మాత్ర‌మే
- ఉద్యోగుల‌కు మాత్రం జ‌గ‌న్‌, బాబు ఇద్ద‌రూ అన్యాయ‌మే..?

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

దేశ‌వ్యాప్తంగా ఇందిర‌మ్మ కాలం నుంచి కూడా కూడు-గూడు-గుడ్డ అనే కాన్సెప్టుకు ప్రాధాన్యం ఉంది. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఏ పార్టీ అయినా.. ఈ మూడు అంశాల‌కు ప్రాధాన్యం ఇస్తుంది. వీటిని ఎన్నిక‌ల హామీలో నూ చేర్చుతారు. ఇలా చూసుకుంటే.. ఏపీలో విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ, త‌ర్వాత‌.. 2019లో అధికారం చేప‌ట్టిన వైసీపీలు.. రెండూ కూడా..పేద‌ల‌కు ఇళ్లు ఇస్తామ‌ని హామీలు ఇచ్చాయి. తొలుత 2014లో అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు పేద‌ల‌కు ఇళ్లు ఇస్తామ‌న్నారు.


అయితే..ఆయ‌న సొంత‌గా ఇచ్చింది లేదు. కేంద్ర ప్ర‌భుత్వం అమలు చేసిన టిడ్కో ఇళ్ల‌ను .. అది కూడా.. అప్ప‌టి కేంద్ర మంత్రిగా ఉన్న ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు మంజూరు చేయించిన 25 ల‌క్ష‌ల ఇళ్ల‌ను మాత్ర‌మే తీసుకున్నారు. వీటిలోనూ.. 4 ల‌క్ష‌లు మాత్ర‌మే మంజూరయ్యాయి. ఇక‌, వీటిలోనూ 1 ఇళ్లు మాత్ర‌మే క‌ట్టించారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్లు 75 వేలు. ఇక్క‌డే  చిత్ర‌మైన ప‌రిస్థితి వ‌చ్చింది. వీటిని ఇచ్చేందుకు జ‌న్మ‌భూమి క‌మిటీలు.. పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నాయ‌నే వాద‌న వినిపించింది. దీంతో ఈ విష‌యం ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం క‌ల్పించ‌లేక పోయింది.


ఇక‌, చంద్ర‌బాబు హ‌యాంలో సొంత‌గా స్థ‌లాల‌ను ఇచ్చిన ప‌రిస్తితి క‌నిపించ‌లేదు. ఇది సాధార‌ణ ప్ర‌జ‌ల ప‌రిస్తితి. ఇక‌, ఉద్యోగుల‌కు కూడా.. ముఖ్యంగా హైద‌రాబాద్ నుంచి ఏపీకి వ‌చ్చిన ఉద్యోగుల‌కు కూడా ఇళ్లు ఇస్తామ‌ని చెప్పారు. కానీ, చేయ‌లేదు. జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్లు ఇస్తామ‌ని రూ.25 వేల చొప్పున క‌ట్టించుకున్నా రు. కానీ, అది కూడా సాకారం కాలేదు. జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. న‌వ‌రత్నాలు -పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో భాగంగా జ‌గ‌న్‌.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని పేద‌ల‌కు సెంటు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు సెంట్ల భూమిని ఇచ్చారు.


ఇక‌, వీటిలో ఎక్క‌డా లంచాల‌కు తావులేకుండా.. జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. మొత్తం 31 ల‌క్ష‌ల మందిని ఎంపిక చేసి.. అంద‌రికీ ప‌ట్టాలు ఇచ్చారు. ప్ర‌స్తుతం అవి నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని చోట్ల గృహ‌ప్ర‌వేశాలు జ‌రిగాయి. అయితే.. ఇక్క‌డ కూడా.. జ‌ర్న‌లిస్టుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇస్తామ‌ని చెప్పి.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేయించి కూడా ఇవ్వ‌లేదు. ఉద్యోగుల‌కు కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్ర చ‌రిత్ర‌లో పేద‌ల‌కు ఈ సంఖ్య‌లో ఇళ్లు ఇవ్వ‌డం.. అవి కూడా మ‌హిళ‌ల పేరుతోనే ప‌ట్టాలు ఇవ్వ‌డం వంటివి గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: