ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి నెలకొంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఓటర్లందరూ కూడా తమ నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. అంతకుముందు ఆయా పార్టీల అభ్యర్థులందరూ కూడా తమనే గెలిపించాలి అంటూ ప్రచార రంగంలో దూసుకుపోయారు. తమను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై స్పష్టమైన హామీలను కూడా ఇచ్చారు.


 ఇక ఓటర్లు ఇలా ఎవరిని నమ్మారు అన్నది మాత్రం ఇక పోలింగ్ పూర్తయిన తర్వాతే తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి నెలకొంది. ఎన్నికలకు సంబంధించి ఎన్నో విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఈవీఎంల ద్వారా ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈవీఎంల గురించి ఎంతోమంది ఓటర్లకు ఎన్నో రకాల అనుమానాలు నెలకొంటాయి. కాగా ఈవీఎంల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. సాధారణంగా ఒక ఈవిఎంలో ఎన్ని ఓట్లనువేయవచ్చు అన్నది చాలామందికి తెలియని విషయం.


 ఆ వివరాలు చూసుకుంటే.. ప్రస్తుతం దేశంలో రెండు వర్షన్ ల ఈవీఎంలు వినియోగిస్తున్నారు అన్నది తెలుస్తుంది. పాత వర్షన్ ( 2000 నుంచి 2005) మోడల్ లో గరిష్టంగా 3840 ఓట్లు నిలువ చేయవచ్చు.  ఇక అదే సమయంలో కొత్త వర్షన్ (2006 నుంచి వస్తున్న మోడల్ లో) గరిష్టంగా 2000 ఓట్లను మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. . ఇక మరోవైపు ఈసీ ప్రకారం కంట్రోల్ యూనిట్ లో ఎన్నికల ఫలితాలు దాదాపు పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం పాటు కూడా నిలువ ఉంచవచ్చు అన్నది తెలుస్తుంది. కాగా తెలుగు రాష్ట్రాలలో మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో కేవలం పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరుగుతుండగా అటు ఆంధ్రాలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Evm