తెలుగుదేశం పార్టీ ఈ సారి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో జనసేన , బీజేపీ తో కలిసి పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక అధికార పార్టీ అయినటువంటి వైసీపీ మాత్రం ఒంటరిగా పోటీలోకి దిగబోతోంది. తెలుగు దేశం పార్టీ కి గుంటూరు ఎంపీ టికెట్ దక్కింది. దానితో దానిని పెమ్మాసాని చంద్రశేఖర్ కి తెలుగు దేశం పార్టీ చాలా రోజుల క్రితమే గుంటూరు పార్లమెంట్ సీటును కేటాయించింది. 

ఇక ఈయనకు ఈ సీటు కేటాయించడం తోనే ఈయన కచ్చితంగా గెలుస్తాడు అని సమీకరణాలు వచ్చాయి. దీనితో తెలుగు దేశం పార్టీ కూడా చాలా సంతోష పడింది. అలాగే కూటమి కూడా ఆనంద పడింది. కానీ అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. ఇక్కడ వైసీపీ పార్టీ కిలారి వెంకట రోశయ్య అనే కాపు సామాజిక అభ్యర్థి కి టికెట్ ను కేటాయించింది. ఈయన ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యే. ఈయనతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొన్నూరు ఎమ్మెల్యే అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి , సత్తెనపల్లి సీట్ ను మంత్రి అంబటి రాంబాబు కు , చిలకలూరి పేట సీట్ ను గుంటూరు మేయర్ గా ఉన్న కవాటి మనోహర్ నాయుడు కి ఇచ్చింది.

అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ మూడు ఎమ్మెల్యే సీట్ లను కాపులకు కేటాయించి , ఒక ఎంపీ సీటును కూడా కేటాయించింది. ఇక టీడీపీ విషయానికి వస్తే కేవలం సత్తెనపల్లి లో కన్న లక్ష్మీనారాయణకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. దీనితో గుంటూరు జిల్లాలోని కాపు సామాజిక వర్గం అంతా ఆలోచనలో పడిపోయింది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు ఓట్ల సంఖ్య భారీగా ఉంటుంది.

వైసీపీ పార్టీ తమ సామాజిక వర్గం అభ్యర్థులకు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వడంతో వీరంతా వైసీపీ సైడ్ మళ్లీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానితో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా మొదట విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఓడిపోయే అవకాశం భారీగా ఉన్నట్లు , వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య గెలుపు అవకాశాలే అధికంగా ఉన్నట్లు ప్రస్తుతం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: