తెలంగాణలో నేడు 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి చోట పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంతా సజావుగా పోలింగ్ కొనసాగుతుంది. అయితే కొన్ని చోట్ల అటు ఈవీఎంలు  మొరాయిస్తూ ఉండడంతో అటు ఓటర్లు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. అదే సమయంలో మరికొన్ని చోట్ల మాత్రం ఏకంగా ఓటర్లు ఓటు వేసేందుకు నిరాకరిస్తూ ఉండడం గమనార్హం. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఊరంతా ఏకమై తాము పోలింగ్ బహిష్కరిస్తున్నాము అంటూ ప్రకటించడం సంచలనంగా మారిపోతుంది.



  ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటివరకు జనాల్లోనే కనిపించిన నాయకులు గెలిచాక ఎక్కడ ముఖం కూడా చూపించరు. ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ల సమస్యలను పట్టించుకునే నాధుడే కనిపించడు. అందుకే ఇలా ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులను నిలదీయడం తమకు కావాల్సిన పనులను చేయించుకోవడం చేస్తూ ఉంటారు ఓటర్లు. ఇక్కడ ఒక గ్రామంలోని ఓటర్లందరూ కూడా ఇదే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సరిగా పోలింగ్ రోజు తాము ఓటు వేసే ప్రసక్తే లేదు అంటూ ఇక నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని ఓ గ్రామంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.



 కొత్తూరులోని కొడిచెర్ల తాండవసలు ఓటు వేసేందుకు నిరాకరించారు. ఉమ్మడి పంచాయితీ అయిన కొడిచెర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగా ఏర్పడిన పంచాయితీ కొడిచెర్ల తండాకు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి అంటూ గ్రామస్తులు కోరారు. కానీ ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడంతో ఊరంతా కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాము పోలింగ్ బహిష్కరిస్తున్నాము అంటూ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎమ్మార్వో అక్కడికి చేరుకుని మరో ఎలక్షన్ నాటికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తాము అంటూ హామీ ఇవ్వడంతో చివరికి ఆ ఊరంతా ఓటు వేసేందుకు అంగీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: