
ఈ క్రమంలోనే ప్రస్తుతం జబర్దస్త్ లో చోటు సంపాదించుకున్న ఎంతోమంది మంచి పాపులారిటీ దక్కించుకొని ఏకంగా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు. కొంతమంది హీరోలుగా కూడా రాణిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ ద్వారా అందే ఎంటర్టైన్మెంట్ రెట్టింపు చేయాలి అనే ఉద్దేశంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే కామెడీ షో ని కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడు వరకు ఈ షోలో ఎంతోమంది కమెడియన్స్ టీం లీడర్స్ మారుతూ వచ్చారు. వీళ్ళు మాత్రమే కాదు జడ్జీలు కూడా పూర్తిగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో రోజుల నుంచి జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా ఇక జబర్దస్త్ కొత్త ఫార్మాట్లో ప్రసారం కాబోతుంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో చూస్తే ఇది నిజమే అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే జబర్దస్త్ ఫార్మాట్ పూర్తిగా మారిపోయింది. ఏకంగా ఆరు టీమ్స్ సరదా శుక్రవారం, సరిపడా శనివారం అంటూ రెండు ఎపిసోడ్స్ గా విడగొట్టారు. అయితే ఈ షోలో ఒక్కరోజు మూడు టీమ్స్ ఇంకో రోజు మూడు టీమ్స్ పెర్ఫార్మ్ చేయగా.. ఒక్కో టీం కి 20 పాయింట్స్ వాళ్ళు చేసిన పర్ఫామెన్స్ ని బట్టి మార్కులు వేస్తారు. రెండు రోజులు మూడు టీమ్స్ కి 60 చొప్పున మార్కులు వేస్తారు. ఇందులో ఏ మూడు టీమ్స్ కి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళే గెలిచినట్టు. ఇక వాళ్లకు ఇచ్చే ప్రైజ్ మనీ కూడా అటు కంటెస్టెంట్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త ఫార్మాట్ జబర్దస్త్ చూసి ఫాన్స్ కూడా షాక్ అవుతున్నారు.