ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని చెప్పవచ్చు. తరుణంలో  రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కింద పనిచేసే మంత్రివర్గం గురించి ప్రస్తుతం  విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది. ఎవరెవరికి ఎలాంటి మంత్రి పదవులు వస్తాయి ఏ శాఖలు కేటాయిస్తారు అనేది చర్చ నియాంశంగా మారింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్. 

ఈయన మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాంటి లోకేష్ కు చంద్రబాబు క్యాబినెట్లో ఎలాంటి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఆయన ఏ పదవికి అయితే సెట్ అవుతారు అనేదానిమీద ప్రస్తుతం  వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మంగళగిరిలో లోకేష్ ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయి  మూడవసారి అత్యధిక మెజార్టీత విజయం సాధించారు. అలాంటి లోకేష్ కు 2016లో  నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు.  అక్కడ కీలకమైన శాఖ అయినటువంటి ఐటీ శాఖ మంత్రి పదవిని అప్పగించారు. ఈ క్రమంలోనే నారా ఆ శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చి చాలా సంస్థలను తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పవచ్చు. అలాగే ఫైబర్ గ్రిడ్ ద్వారా గ్రామాల్లో కూడా నెట్ కలెక్షన్ ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చారు.

ఇది అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకం.  పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో  అమలు చేయడంలో నారా లోకేష్ కీలకమైన పాత్రను పోషించారని చెప్పవచ్చు. ప్రస్తుతం లోకేష్ కు  ఇదే ఐటి శాఖ పదవి మరోసారి ఇవ్వాలని అంటున్నారట. ఎందుకంటే ఆయనకు ఐటీ పర్పస్ లో మంచి పట్టు ఉంది. ఆయనకు ఐటి శాఖ మంత్రి పదవి ఇస్తే  మరిన్ని ఐటి కంపెనీలు ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయించడంలో ప్రధమంగా ఉంటారని భావిస్తున్నారట.  మరి ఇదే ఇస్తారా లేదంటే ఇంకా ఏదైనా మంత్రి పదవి కోసం ఆలోచన చేస్తారా అనేది ఇంకా కొన్ని రోజుల్లోనే తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: